ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరి పాలన, ప్రభుత్వ విధానాల కు రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అడ్డుపడుతున్నారని కేంద్ర ప్రభుత్వానికి లేఖ సమర్పించారు. అయితే ఈ విషయం దేశం మొత్తం మీద సంచలనం అవ్వగా.. న్యాయాని కి ప్రత్యక్ష దేవుళ్ళు అయిన. . సుప్రీం కోర్ట్, హైకోర్టు న్యాయమూర్తుల పైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి ఫిర్యాదు చేసి వాళ్లపై న్యాయ విచారణ జరిపించాలని న్యాయవ్యవస్థకే తూట్లు పొడిచిన ముఖ్యమంత్రిగా చెప్పుకో  వచ్చని ప్రముఖ న్యాయ మూర్తులు జస్టిస్ జిఎస్ మనీ , ప్రదీప్ కుమార్ మాధవ్ అన్నారు.


 ఎన్నో కేసులలో  నిందితుడిగా ఉండి  16 నెలల జైలు శిక్ష అనుభవించి లెక్కకు మించిన ఆస్తులు గడించి. . ఇప్పటికీ ఆ కేసులు కోసం కోర్టు ల చుట్టూ తిరుగుతున్న సీఎం జగన్ న్యాయమూర్తులను తప్పు పట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే ఇది న్యాయమూర్తులు తెలంగాణ రాష్ట్రం  లో సంచలనం సృష్టించిన దిశా ఘటన నిందితుల  ను రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ చేయడాన్ని తప్పు పట్టింది. ఈ ఎన్ కౌంటర్ ని దేశం మొత్తం గౌరవించింది అని గుర్తు చేశారు. ఈ న్యాయమూర్తులు మాత్రం అప్పుడు న్యాయస్థానాన్ని , రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.


కొన్ని సందర్భాల్లో న్యాయ స్థానాలు చేసేవి ఒప్పని. . మరికొన్ని సందర్భాల్లో తప్పని.. చెప్తున్న ఈ న్యాయమూర్తులు మా ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత కోల్పోయారని వైఎస్ఆర్ సీపీ నాయకులు అన్నారు. నిజంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వారు అలా మాట్లాడరు అని అన్నారు.  వీరి కే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు వీరు న్యాయమూర్తి గా ఉంటూ న్యాయ వృత్తిలో కొనసాగడానికి అసలు అర్హులో కాదో తేల్చు కోవాలని వారిపై విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: