ఒక్కొక్కరుగా ఇప్పుడు జగన్ జపం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర అధికార పార్టీ బిజెపి జగన్ ను దగ్గర చేసుకోవాలని, రాజకీయంగా మరింత బలపడాలని చూస్తుండగా, సిపిఐ, సిపిఎం సైతం జగన్ వైపు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు జనసేన పార్టీ తో కలిసి అడుగులు వేశాయి. ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లను కూడా తీసుకుని పోటీచేశాయి. కానీ ఎక్కడా ఫలితం కనిపించలేదు. దీంతో ఇప్పుడు జగన్ వైపు వెళ్తేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పేదల సంక్షేమం కోసం జగన్ చేస్తున్న కృషి, వంటి ఎన్నో వ్యవహారాలను ఆధారంగా చేసుకుని జగన్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సిపిఎం పార్టీ జగన్ వైపు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తోంది.


గతంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అనారోగ్యానికి గురైన సందర్భంగా, ఏపీ సీఎంగా ఉన్న జగన్ ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు.ఇక జగన్ పాలనాపరంగా జనాల దగ్గర మంచి మార్కులే వేయించుకోవడం, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా అన్ని చక్కబెడుతూ ఉండడం వంటి వ్యవహారాలను లెక్క వేసుకుంటున్న సిపిఎం, మిగతా పార్టీలతో కలిసి ముందుకు వెళ్ళినా ప్రయోజనం ఉండదని, జగన్ తో అడుగులు వేస్తే, తమ రాజకీయ భవిష్యత్తు కు ఎటువంటి  ఢోకా ఉండవనే అభిప్రాయంలో ఉన్నారట. ఏపీ ప్రభుత్వం సైతం సీపీఎం కు చెందిన ప్రజాశక్తి పత్రికకు భారీగానే ప్రకటనలు ఇస్తూ, ఆర్థికంగా అండగా ఉంటూ వస్తూ ఉండడం వంటి వ్యవహారాలు లెక్కలు వేసుకుంటున్నారు.


సిపిఎం జగన్ తో కలిసి అడుగులు వేయాలని నిర్ణయానికి వచ్చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో తాము అనుకూలంగా ఉంటూ వచ్చామని, ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు మాత్రమే తీసుకుని పోటీ చేసాము అని, కానీ తమతో చెప్పాపెట్టకుండా బీజేపీతో ఆకస్మాత్తుగా పవన్ పొత్తు పెట్టుకోవడం వంటి వ్యవహారాలు సిపిఎంకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు అన్ని విధాలుగా కలిసిరావాలంటే వైసిపి తో కలిసి ముందుకు వెళ్తేనే మంచిదనే అభిప్రాయంలో ఆ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ వ్యవహారానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: