ఇపుడు జాతీయ రాజకీయం అంతా ఏపీ వైపే చూస్తోంది. జాతీయ మీడియా అటెన్షన్ సైతం ఇటువైపే ఉంది. ఏపీలో అలాంటి సంచలనం ఒకటి స్వయంగా జగన్ సర్కార్ నమోదు చేసింది. ఏకంగా ఒక సీనియర్ న్యాయ మూర్తికి వ్యతిరేకంగా లేఖ రాయడం ద్వారా జగన్ కొత్త చర్చకు, సరికొత్త సంప్రదాయానికి తెర లేపారు. అసలు దీని మీద ఏం జరుగుతుంది. ఏం జరగాలి ఇవన్నీ కూడా అసక్తిని కలిగించే వ్యవహారాలే. నిజానికి ఢిల్లీలో బయటకు ఏం జరిగినట్లుగా కనిపించకపోయినా రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్యన చోటు చేసుకున్న పరిణామాలు, ఘర్షణ మీద కేంద్రం దృష్టి సారించింది అని అంటున్నారు.

జగన్ లేఖలో పేర్కొన్న అంశాలు చేసిన ఆరోపణలపైన కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే లోతైన పరిశోధన చేస్తున్నారని కూడా అంటున్నారు.  ఈ క్రమంలో హఠాత్తుగా జగన్ కి కుడి భుజం లాంటి ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీ టూర్  పెట్టుకోవడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఉన్నఫళంగా ఆయన హస్తిన బాట పట్టడం పైన అనేక రకాలుగా విశ్లేషణలు వస్తున్నాయి. నిజానికి ఆయనకు విశాఖలో నాలుగు రోజుల ప్రొగ్రాం పెట్టుకున్నారని భోగట్టా.

ఆయనకు ఇప్పట్లో ఢిల్లీ వెళ్ళే పని కూడా లేదు, కానీ ఆయన అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లారని వార్తలు వస్తున్నాయి. దాంతో ఏదో జరుగుతోంది అన్న చర్చ అయితే మొదలైంది. ఇక ఏపీ సర్కార్ తన పని తాను చేసుకుంటూ సమీక్షలను చేపడుతోంది. మరో వైపు ఢిల్లీలో న్యాయవాదులు కొందరు జగన్ సర్కార్ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని పిటిషన్లు సుప్రీం కోర్టులో వేస్తున్నారు. ఈ నేపధ్యంలో అసలు ఏం జరుగుతోంది అన్నది మాత్రం ఉత్కంఠగానే ఉంది. ఏది ఏమైనా రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం మంచి పరిణామం కాదని ప్రజాస్వామ్య ప్రియులు, రాజ్యాంగ కోవిదులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: