ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు జగన్ సిద్ధమైపోయారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో క్యాంప్ ఆఫీస్ కే జగన్ పరిమితం అయిపోతున్నారు. జగన్ ఇకపై జనం బాట పట్టకపోతే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండవు అని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచి అన్ని కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నారు. ఎక్కడా, ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా అన్ని చక్క పెడుతున్నారు. కరోనా వైరస్ ప్రభావం తీవ్రత ఎక్కువగానే ఉన్నా , ఇది ఎప్పటికి తగ్గుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.



 దీంతో కనీస జాగ్రత్తలు తీసుకుంటూనే జనంలోకి రావాలని, ఎక్కువగా ప్రజలతో మమేకమవుతూనే పరిపాలన కొనసాగించాలని, నిర్ణయం తీసుకున్నారట. దీనివల్ల ప్రభుత్వం పై జనంలో లో మరింతగా నమ్మకం ఏర్పడుతుందని జగన్ నమ్ముతున్నారు. ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి జగన్ ఎక్కువగా వీడియో సమావేశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు .జనంలోకి వచ్చేందుకు ఇష్టపడడం లేదు. సచివాలయానికి కూడా జగన్ వెళ్లడం లేదు. అన్ని క్యాంప్ ఆఫీస్ నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై సచివాలయం కూడా వెళ్లాలని, అక్కడి నుంచి అన్ని పనులను చేపట్టడం ద్వారా మిగతా మంత్రులు కూడా తప్పనిసరిగా సచివాలయానికి వస్తారని, అధికారుల పనితీరు కూడా మారుతోందని జగన్ అభిప్రాయపడుతూ త్వరలోనే సచివాలయం నుంచి పరిపాలనను కొనసాగించే ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 


ఇక ఆ తర్వాత జనంలోకి వెళ్లేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించుకునే పనుల్లో జగన్ ఉన్నారట.  అప్పుడప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి వస్తున్నా, జనంలోకి వెళ్ళలేని పరిస్థితి. ఎక్కువ రోజులు కూడా ఏపీలో ఆయన ఉండడం లేదు. హైదరాబాదులో తన నివాసంలో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. దీని కారణంగా పార్టీలో నిరుత్సాహం అలముకుంది. ఆ పరిస్థితి వైసీపీకి కూడా రాకుండా జగన్ ముందుగానే జాగ్రత్తలు ప, బలం పెంచుకునేందుకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: