పరిపాలనలో ఒక్కో నాయకుడిది ఒక్కో స్టయిల్.. చంద్రబాబు హయాంలో ఏదైనా వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వస్తే  ఆయన హుటాహటిన అక్కడ వాలిపోయేవారు . అధికారులపై కేకలు వేసేవారు.. కాకపోతే ఆఫీసు బాయ్ పని దగ్గర నుంచి ఆఫీసర్ పని వరకూ అంతా తానే చేస్తున్నట్టు మీడియాలో కనిపించాలన్న తాపత్రయం బాగా కనిపించేది. చేసే పని కంటే ఎక్కువగా శ్రద్ధ మీడియా కవరేజ్‌ మీద ఉండేది. దానికి తగ్గట్టు ఆయన అనుకూల మీడియా కూడా భజనకు సిద్ధంగా ఉండేది.

అయితే జగన్ తీరు అలా కాదంటున్నారు వైసీపీ నాయకులు.  చంద్రబాబు లాగా కేవ‌లం ఫోటోల‌కు ఫోజులిచ్చే సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కాద‌ని... న‌ష్టం జ‌రిగిన వెంట‌నే మానవతా దృక్పథంతో సహాయం చేసే మనస్తత్వం జ‌గ‌న్‌ది అని  మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. చంద్రబాబులా పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదు సీఎం జగన్ కాద‌ని, జూమ్ మీటింగ్‌లు మానుకొని బాబు రాష్ర్టానికి రావాల‌ని తెలిపారు. రాష్ర్టంలో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా ప్రాథ‌మికంగా విశాఖ‌లో 5795 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

న‌ష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుంద‌ని  మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. పంట న‌ష్టపోయిన రైతుల జాబితాను గ్రామ వార్డ్ స‌చివాల‌యంలో పెడ‌తార‌ని, ఎవరి పేర్లయినా  జాబితాలో లేక‌పోయినా  నమోదుకు మళ్ళీ అవకాశం కల్పిస్తామ‌ని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షం నమోదైనా... ప్రభుత్వం అప్రమత్తం కావ‌డం వ‌ల్లే పెద్దగా ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం అన్ని ర‌కాల చర్యలు తీసుకుంటే చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజ‌మెత్తారు.


రాష్ర్టంలో కురిసిన భారీ వ‌ర్షాల గురించి ముందుగా అప్రమత్తం అవడం వ‌ల్ల మత్స్యకారులకు నష్టాన్ని చాలా వరకు నివరించగలిగామని  మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. భారీ వర్షాలకు విశాఖ జిల్లాలో  30 మండలాల్లో వర్షాలు తీవ్ర ప్రభావం చూపించాయని... భారీ వర్షాలకు జిల్లాలో 5 మంది చనిపోయారని మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: