జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా మద్యపాన నిషేధం దిశగా జగన్ మోహన్ రెడ్డి సర్కారు నడుం బిగించింది..ఆ  దిశగా కీలక నిర్ణయాలు కూడా తీసుకొని చర్యలు చేపట్టింది. మద్యం షాపులు అన్నింటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో కి తీసుకొని పని వేళలను మద్యం షాపుల సంఖ్య కూడా కుదిస్తూ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది జగన్మోహన్రెడ్డి సర్కార్. అదే సమయంలో మద్యం ధరలు భారీగా పెంచి సామాన్య ప్రజలకు మద్యం  అందుబాటులో ఉండని  విధంగా చేసి మరో ముందడుగు వేసింది.




 ఇక ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోకి అక్రమంగా మద్యం రాకుండా ఎంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సంకల్పించిన సంపూర్ణ మద్యపాన నిషేధం ఆంధ్రప్రదేశ్ ఆస్థులు సమర్థవంతంగా అమలు అయింది అని చెప్పాలి. అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇటు రాష్ట్ర ప్రజలు కూడా మద్యపాన నిషేధం దిశగా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. మామూలుగా అయితే పోలీసు తనిఖీల్లో  ఎన్నో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బయటపడుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.




 కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఆరు నెలల కాలంలో బయటపడిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం నిర్ణయం సమర్థవంతంగా అమలు అవుతుంది అన్న విషయాన్ని నిరూపిస్తున్నాయి. గత ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో కేవలం మూడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయని రవాణా శాఖ తెలిపింది. ఈ మేరకు రోడ్ సేఫ్టీ పై ఏర్పాటయిన సుప్రీం కోర్టు కమిటీ కి  నివేదికలో తెలిపింది రాష్ట్ర రవాణా శాఖ. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తోనే రాష్ట్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా తగ్గిపోయాయి అంటూ లేఖలో పేర్కొంది. గుంటూరులో  రెండు కృష్ణా జిల్లాలో ఒక డ్రంక్ అండ్  డ్రైవ్ కేసు నమోదైనట్లు ఏపీ రవాణా శాఖ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: