భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి నుండి అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటాం. కానీ ఎప్పుడు కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఏ ప్రభుత్వాలు చెప్పలేదు. దాదాపుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 73 ఏళ్లు దాటిన అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనుకంజ లోనే ఉంది. అదే జపాన్ లాంటి చిన్నదేశం మనకు స్వాతంత్రం వచ్చేనాటికి ముందు అంటే 1945 సంవత్సరం లో రెండో ప్రపంచ యుద్ధంలో రెండు అణు బాంబులు దాడికి గురై పూర్తిగా సర్వస్వం  కోల్పోయి చాలా దీన స్థితిలోకి వెళ్లిపోయింది.  దీనికితోడు ఎప్పటికప్పుడే జపాన్ని భూకంపాల చుట్టుముట్టి నీటి మట్టం చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల నడుమ ఇక జపాన్ పని అయిపోయింది.


ఎందుకు పనికిరాని దేశంగా మిగలడం తప్ప చేసేది ఏమీ లేదు అనుకున్నాయి ప్రపంచ దేశాలు అంతా. కానీ ఇప్పుడు జపాన్ దేశం అడ్వాన్సు టెక్నాలజీ గా ప్రపంచ దేశాల అన్నింటికంటే బాగా అభివృద్ధి చెంది ప్రగతి పథంలో నడుస్తుంది. ఇదెలా సాధ్యమైందంటే జపాన్ దేశంలో ప్రతి పౌరుడు తన పని తాను చేసుకు పోతాడు. అక్షరాస్యత శాతం కూడా 99%, నిరుద్యోగం అన్న మాటే ఉండదు, స్కూల్ స్టేజ్ నుంచే ప్రతి పిల్లవానికి కతన శక్తి సామర్థ్యాలను బట్టి స్కిల్స్ డెవలప్ చేస్తారు.


 ఇక్కడ నో క్రైమ్ ,నోకరప్షన్ ఇక్కడ చట్టాలు కూడా తప్పు చేస్తే చాలా కఠినంగా ఉంటాయి. జపాన్ కూడా ఒక తయారీ రంగం ఎప్పుడు ఏదో ఒక వస్తువు తయారుచేయడం కొత్తగా కనిపెట్టడం అక్కడ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య ఈ దేశంలో ఎక్కడైనా బెగ్గర్ కనిపించినట్లయితే స్వయంగా ప్రభుత్వాలే తనకు పని కల్పిస్తాయి. ఇవన్నీ జపాన్ ప్రజలు కఠినంగా పాటిస్తారు కాబట్టే ఈ రోజు ప్రపంచ దేశాల ముందు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తల వడ్డీ నిలబడ్డాయి. ఇక భారత్ లాంటి దేశాలు జపాన్ చూసి నేర్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: