చాలా  మందికి కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం. ఒకటి రెండు కాదు ఏకంగా బాటిల్ మీద బాటిల్ ని లాగించేస్తుంటారు కదా.. అయితే మరి నిజంగా ఎక్కువ కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిదా...? మరి పూర్తిగా చదివి ఇప్పుడే తెసులుసుకోండి. కొన్ని సర్వేలు తాజాగా చెప్పిన వాటి ప్రకారం.....   ఈ సర్వే లో కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ప్రాణానికే ముప్పు ఉందని ఫ్రాన్స్ లోని 'ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్' నిర్వహించిన పరిశోధన లో నీల్ మర్ఫీ పరిశోధకుడు స్పష్టం చేశారు. వీటిలో  కృత్రిమ చక్కెరను ఉపయోగించడమే ప్రధాన కారణం అని అన్నారు. డ్రింక్స్ మూలంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి.

ఏకంగా 16 ఏళ్ల పాటు చేసిన  పరిశోధనలో కొన్ని కీలక విషయాలను తెలుసుకున్నారు. కొన్నేండ్లుగా 10 యూరోపియన్ దేశాల్లో 4,52,000మంది పురుషులపై, మహిళలపై ఈ పరిశోధనలు చేసి భయంకర నిజలను వెళ్లడించారు. అలానే కూల్ డ్రింక్ ఉండే ఫాస్పోరిక్, కార్బోనిక్ ఆమ్లాల వల్ల దంత క్షయం ఏర్పడుతుంది. దీనితో పాటు మరీ ముఖ్యంగా దంతాలను నాశనం చేస్తుంది అని తెలియజేసారు.  అలానే 43 శాతం మంది క్యాన్యర్ల వల్ల, 21.8 శాతం మంది రక్త ప్రసరణ సమస్యల వల్ల, 2.9 శాతం జీర్ణ సంబంధిత వ్యాధుల మూలంగా మరణించారని తెలియజేయడం జరిగింది.

శీతల పానియాలని  అధికంగా తీసుకుంటే దాని వల్ల డయాబెటీస్ కి దారి తీస్తుంది. గుండె జబ్బులు, అధిక బరువు, మొదడు మొద్దుబారడం, శరీరంలో లోపలి భాగాలు చెడిపోవడం వంటివి జరుగుతాయి.  ఇలా ఎన్నో ససమస్యలని కూల్ డ్రింక్స్ ద్వారా కొని తెచ్చుకుంటున్నాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: