డెంగ్యూ జ్వరాలు ఆడదోమ కుట్టడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది జ్వ‌రంతో ప్రారంభ‌మై ఒక్కోసారి ప్రాణాలు తీసే వ‌ర‌కు వెళ్తుంది. వర్షకాలంలో డెంగ్యూ జర్వాలు విజృంభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి డెంగ్యూ జ్వరం మీ దరికి చేరకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా.

ఇక డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి రోగాలు రాకుండా ఉండాలంటే దోమలను పూర్తిగా నియంత్రించాలి. అంతేకాదు నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులను పూర్తిగా కప్పుకోవాలి. వేప నూనె, కొబ్బరి నూనె కలిపి ఒంటికి పూసుకుంటే.. దోమలు దగ్గరికి రావు. మస్కిటో కోయిల్స్, ఆల్‌ఔట్ వంటి వాటిని ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. బయట తిండి తినకపోవడమే సురక్షితం.

ఫిల్టర్ లేదా కాచి ఒడబోసిన నీళ్లు మాత్రమే తాగాలి. ఇంటి చుట్టూ నీరు లేకుండా, పరిసరాల్లో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ గ్లాసులు వంటివి లేకుండా చూడాలి. ఇంటి మూలల్లో తరుచూ శుభ్రం చేస్తూ ఉండాలి. పూల కుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీరు నిల్వ చేస్తే.. వాటిపై మూతలు సరిగ్గా పెట్టాలి. దోమల నియంత్రణకు ఫాగింగ్ కూడా అవసరమే.. మునిసిపల్ అధికారులకు చెప్పి ఫాగింగ్ తప్పనిసరిగా చేయించండి.
 
అయితే డెంగీతో బాధ‌ప‌డుతున్న వారికి దానిమ్మ‌, కివీ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌నుపెంచ‌డానికి స‌హాయం చేస్తుందని నిపుణులు తెలిపారు. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతాయని అన్నారు. డెంగీ ఫీవర్ తో బాధ‌ప‌డుతున్న వారు ఎక్కువగా కొబ్బరి బోండాం నీళ్లు తాగితే మంచిది. కొబ్బరి నీళ్ళు శరీరం ద్వారా కోల్పోయిన ఎలెక్ట్రోలైట్స్ మరియు ఇతర ట్రేస్ మినిరల్స్ అందించి శరీరంను డీహైడ్రేషన్ నుండి ర‌క్షిస్తుంది. ఇక డెండీ నివార‌ణ‌కు ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు గ్రేట్‌గా ప‌నిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: