తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడటానికి కొంతమంది కీలక నేతలను తమ వైపు తిప్పుకునే విధంగా పావులు కదుపుతోంది అనే వార్తలు మనం కొన్ని రోజుల నుంచి వింటూనే ఉన్నాం. అయితే కొందరు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి చాలా వరకు కూడా ఆసక్తి చూపించడం లేదు అని ప్రచారం కూడా జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నుంచి తమ వైపుకు నేతలను తిప్పుకునే విధంగా జాగ్రత్తగా వ్యవహరించే ఆలోచనలో ఉన్నారని ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారని వార్తలు ఈ మధ్యకాలంలో వినిపించాయి.

దాని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ప్రకారం చూస్తే ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు విషయంలో మాత్రం బీజేపీ చాలా సీరియస్ గా ఉందని సమాచారం. ఆయన కోసం నేరుగా కేంద్ర మంత్రి కూడా రంగంలోకి దిగారని అంటున్నారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడా తమ వైపు తిప్పుకునే విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సండ్ర వెంకటవీరయ్యను బీజేపీ లోకి తీసుకుని వెళ్లే విధంగా పావులు కదుపుతున్నారు.

అంతేకాకుండా అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావును కూడా ఇప్పుడు బీజేపీ లోకి ఆహ్వానించే విధంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే సండ్ర వెంకటవీరయ్య మాత్రం ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళకుండా తెలుగుదేశం పార్టీలో లేకుండా అలాగే ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి ఆయన మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం రాజీనామా చేయలేదు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా కు చెందిన ఇద్దరు నేతల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మరి పార్టీ మారతారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: