రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ కు వచ్చిన ఇబ్బందులు అంటూ ఏమీ లేవు అనే చెప్పాలి. అయితే కొంతమంది వ్యవహరిస్తున్న తీరు కారణంగా సీఎం జగన్ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతి వ్యవహారాలలో ఎక్కువగా ఉన్నారు అని ఆరోపణలు సీఎం జగన్ వద్దకు వచ్చాయి.

దీంతో సీఎం జగన్ ఇప్పుడు చాలా వరకు కూడా వారి మీద ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు వ్యవహారాల్లో మునిగి తేలుతున్న నేపథ్యంలో వారి మీద కేసులు నమోదు చేయాలని అవసరమైతే సీఐడీ తో విచారణ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొంతమంది నేతలు సీఎం జగన్ చెప్పిన సరే  వినడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల్లో వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. చివరకు ఓట్లు వేసిన ప్రజలను కూడా పట్టించుకోకుండా వారు... వ్యవహరించడంతో సీఎం జగన్ చాలావరకు సీరియస్ గా ఉన్నారు.

ఇప్పటికే దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు కు సంబంధించిన అవినీతి వ్యవహారాలు సీఎం జగన్ తన వద్ద పెట్టుకున్నారు. వారందరి మీద కూడా ఇప్పుడు కేసు పెట్టడానికి ఆయన రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సిఐడి అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి అవినీతి నేతల మీద ఫోకస్ పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం వ్యాపారాలు చేసుకోకూడదు. కానీ కొంతమంది సీఎం జగన్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరించడంతో జగన్ తన మార్క్ ట్రీట్మెంట్ ఇవ్వాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: