ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నికల్లో ఓడిపోయాం అన్న చింత కొంత కూడా లేకపోగా మళ్ళీ ప్రజల్లో నమ్మకం పెంచుకుందామన్న భావన అస్సలు వారి లో కనపడట్లేదు.. ఇప్పటికే చాల సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని, ప్రజలను గాలికి వదిలేసింది టీడీపీ. ప్రజలవద్దకు వెళ్ళడానికి వారికి ఎందుకు ఇష్టం ఉండట్లేదు తెలీదు కానీ ప్రజల్లో మాత్రం వారు రోజు రోజు కి దిగజారిపోతున్నారు.. దానికి తోడు టీడీపీ పరిస్థితి  పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది.. ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా దాడి చేస్తుందో తెలియని పరిస్థితి.. ఇప్పటికే టీడీపీ నేతలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు..

వైసీపీ ఆపరేషన్ అవినీతి లో ఇప్పటికే పలువురి టీడీపీ నేతలను జైలు కి పంపింది. దాంతో  ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమను జైలుకి పంపిస్తారన్న భయం టీడీపీ నేతల్లో నెలకొంది.. ఓ వైపు చంద్రబాబు మొత్తుకున్నా నేతలు మాత్రం బయటకి వచ్చే సాహసం చేయలేకపోతున్నారు.. ఆంధ్రాలో ఇలాంటి పరిస్థితి ఉంటే తెలంగాణ లో టీడీపీ పరిస్థితి అట్టడుగుకు చేరిపోయింది. ఇప్పటికే హైదరబాద్ ని అకాల వర్షాలు ముంచెత్తాయి. ఈమధ్య కాలంలో ఎప్పుడూ లేని స్థాయిలో వర్షం పడటంతో నగరాన్ని వరద నీరు చుట్టుముట్టింది.

ర్షాలు తగ్గినా వరద పరిస్థితి ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం మాత్రం కనపడటం లేదు.  ఆర్ధిక సహాయం సంగతి తర్వాత, మా సమస్యను మీరు వినండి ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళండి సార్ అంటూ చాలా మంది నాయకులను ప్రజలు వేడుకునే పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ మహా నగరంలో ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో అసలే బలహీనంగా ఉన్న టీడీపీ ముందడుగు వేస్తే మంచిది.. కానీ టీడీపీ కొంచెం కూడా కదలకపోవడం ఆశ్చర్యంగా ఉంది..  రాష్ట్ర అధ్యక్షుడు గాని, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్ లు గాని, అసెంబ్లీ ఇంచార్జ్ లు గాని ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు. పార్టీకి నాయకత్వం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ఉన్న కొద్దీ మంది నాయకులు కూడా ప్రజల్లోకి రాకపోతే ఎలా అని పార్టీ మీద అభిమానం, మమకారం ఉన్న కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: