దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఈ మహమ్మారిని అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ విధించడంతో బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీల పరిస్థితి దారుణంగా మారింది. దింతో సొంత గూటికి ప్రయాణమైన వలస కార్మికుల బతుకు ప్రయాణం..ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేనిది. కాలినడకన వందల కిలోమీటర్లకు ప్రయాణం చేసి గమ్యస్థానాన్ని చేరుకున్నారు. వారి ఈ ప్రయాణంలో ఎన్నో సమస్యలను అధిగమించారు. వలస కార్మిక కుటుంబాలకు చెందిన మహిళలు తమ పిలల్లను మోస్తూ సాగించిన ప్రయాణం స్త్రీశక్తికి అద్దం పట్టింది.

ఇక దేశంలో లాక్ డౌన్ కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. పూట గడవడానికి కష్టతరంగా మారడంతో సొంత గూటి వైపు అడుగు వేశారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరు అని అనడానికి ప్రతీకగా నిలిచారు. అందుకే వలస కార్మిక మహిళలను అపర కాళికలా పూజిస్తున్నారు బెంగాలీలు. దసరా పండుగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతలో నెలకొల్పే మండపాల్లో కాళిక విగ్రహాలకు బదులుగా వసల కార్మిక కుటుంబాలకు చెందిన మహిళల విగ్రహాలను ఉంచబోతున్నారు. దుర్గమ్మలా ఆ విగ్రహాలను పూజించనున్నారు. ఇక వసల వెళ్లే సమయంలో ఆ మహిళలు ఎలా కనిపించారో.. దానికి ప్రతిబింబలా విగ్రహాలను రూపొందించారు.



వలస కూలీలా ప్రయాణంలో మహిళలు ఒక్కవైపు పిల్లలను ఎత్తుకుని.. మరోవైవు మరోవైపు సంచులను మోస్తూ.. వారు ఎలా కనిపించారో.. అదే రూపంలో వలస కార్మిక మహిళల విగ్రహాలను రూపొందించారు. వాటిని దుర్గా మండపాల్లో ఉంచి పూజించనున్నారు. కోల్ కత్తా బెహలా ప్రాంతానికి చెందిన బారిష క్లబ్ దుర్గా పూజా కమిటీ ఈ విగ్రహాలను నెలకొల్పాపోతున్నారు. ఇక శనివారం దసరా పండుగ సందర్భంగా ఆ విగ్రహాలను దసరా మండపాల్లో ఉంచి పూజించనున్నట్లు వెల్లడించింది. అవసరం వచ్చినప్పుడు కొండలాంటి కష్టాన్నయినా ఢీ కొట్టి విజయం సాధించగలమనే విషయాన్ని వలస కార్మిక మహిళలు ఈ ఘటనతో తెలియజేశారు. అందుకే వారిని అమ్మవారిలా పూజించాలని నిర్ణయించుకున్నట్లు అక్కడి ప్రజలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: