తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు రాష్ట్రం పరిస్థితి ఎలా తయారైందో అందరికి తెలిసిందే. రాజధాని లేదు, సరిగ్గా అభివృద్ధి చెందిన ప్రాంతం లేదు.. కేంద్రం చిన్న చూపు తో కుదేలయిపోయిన రాష్ట్రాన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.. ఇక కేంద్రం లో అప్పుడే అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ అయినా రాష్ట్ర బాగోగులు చేసుకుంటుందా అంటే అదీ లేదు. మన రాజకీయ నాయకులూ ఎన్ని చెప్పినా, ఎన్ని పోరాటాలు చేసినా మోడీ కి కనీసం ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలనిపించలేదు..

ఎన్నికల్లో ఓ మాట చెప్పి, గెలిచాక మదం తిప్పాడు మోడీ.. ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. గెలిచాక ప్రత్యేక హోదా కాదు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని అన్నారు.. తీరు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాక కూడా ఏమీ ఇవ్వమని మోడీ తేల్చడం రెండో సారి రాష్టం మోసపోయినట్లు అయ్యింది.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రభాను అసమర్థత ఇక్కడ స్పష్టంగా కనిపించింది.. చేసే పోరాటమేదో గట్టిగా చేయకుండా పైపైనే చేసి కేంద్రం ద్రుష్టి రాష్ట్రం యొక్క ఇబ్బందులు స్పష్టం గా తెలిసేలా చేయలేదు.. అందుకే మోడీ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు..

ఇక ఇప్పుడు మోడీకి ఏపీ పై అమితమైన ప్రేమ పొంగుతుంది.. చీటికీ మాటికీ జగన్ తో ముచ్చటిస్తూ హామీల మీద హామీలు కురిపిస్తున్నారు.. ఇక ఆంధ్రప్రదేశ్ లో వరద సృష్టించిన భీభత్సంపై  మోడి సీఎం జగన్ ను ఫోన్ లో వాకబు చేశారు. వరద కారణంగా దెబ్బతిన్న పంటలకు, రహదారుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అన్ని విధాలుగా సహయం అందిస్తుందని ప్రధాని ముఖ్యమంత్రి జగన్ కు హామీ ఇచ్చారు. వర్షాల వలన ఇబ్బందులు ఎదుర్కుంటున్న బాధితులు త్వరగా ఈ విపత్తు నుండి కోలుకుని క్షేమంగా ఉండాలని తాను భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వర్షాలు ఇప్పుడే కాదు గతంలోనూ వచ్చాయి.. మరీ ఇప్పుడే మోడీ ప్రేమను కురిపించడం పై వ్యూహం ఏంటో ఈపాటికే అందరికి తెలిసిపోయే ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: