గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాలకు ఇప్పుడు రోడ్లన్నీ కూడా జల మయం అయిపోయాయి. మూడు రోజుల పాటు పడిన భారీ వర్షానికి హైదరాబాద్ అస్తవ్యస్తం అయిపోయింది. ప్రజలు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. అధికారులు కూడా ఏం చేయాలో అర్థం కాక నానా అవస్థలు పడ్డారు. భవిష్యత్తులో ఇదే విధంగా వరదలు వస్తే అసలు పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికంతటికీ ప్రధాన కారణం అక్రమ కట్టడాలు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

 ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కచ్చితంగా మళ్లీ చెరువులు వచ్చే విధంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ దీనికి సంబంధించి అధికారులతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. త్వరలోనే అధికారులతో సీఎం కేసీఆర్ కూడా సమావేశం నిర్వహించి హైదరాబాదులో గతంలో ఎన్ని చెరువులు ఉండేవి ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి అనే వివరాలను తెప్పించుకునే విధంగా తెప్పించుకునే చర్యలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఒక జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పెద్ద పెద్ద చెరువులను ఎక్కడైతే ఆక్రమించారో... ఆ ప్రాంతాల్లో ఉన్న భవనాలను ఎవరైనా సరే పడగొట్టాలి అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసింది. ప్రధానంగా కొంతమంది సినీ ప్రముఖులు హైదరాబాద్ లో ఆక్రమించారు అనే ఆరోపణలు ఉన్నాయి. చెరువులను ఎక్కడైతే ఆక్రమించారో వారందరి విషయంలో కూడా సీఎం కేసీఆర్ సీరియస్ గా వెళ్లే అవకాశాలు ఉండవచ్చు. మంత్రి కేటీఆర్ కూడా ఇప్పటికే తన దగ్గర జాబితాను పెట్టుకుని ఈ అక్రమ భూముల విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది, మరి భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: