గత ఏడాది జరిగిన ఏపి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ మేరకు 151 స్థానాల్లో వైసీపీ ఫ్యాన్ తిరిగింది. ఇక అతి తక్కువ స్థానాలను కైవసం చేసుకున్న అధికార పార్టీ టీడీపీ ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. ఎక్కువ మెజారిటీ తో గెలుపొందిన వైసీపీ ఈ ఏడాదికి అధిష్టానాన్ని అధిరోహించారు. వై యస్ మరణం తర్వాత ఇన్నెళ్లకు అధికారాన్ని అందిపుచ్చుకోవడం వైసీపీ నేతలు,కార్యకర్తల సంతోషానికి అవధులు లేవు.



కాగా, వైసీపీ పాలనలోకి వచ్చి రాగానే కరోనా లాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అలాంటి సమయంలో ప్రజలను కరోనా నుంచి కాపాడటానికి ఎన్నో విధాలుగా వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.  రైతులకు సాయం చేసినట్లుగా రైతు భరోసా పేరుతో రుణాలను మంజూరు చేసింది. డ్వాక్రా మహిళలకు రుణాలను ఇచ్చింది. విద్యార్థులకు విద్యా కానుక పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో చేతికొచ్చిన పంట నీట మునగడం తో రైతన్నలను కష్టాల కూబిలోకి నెట్టేసాయి.


ఇది ఇలా ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ఎన్నికలను నిర్వహిస్తే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాదు అని టీడీపీ నేతలతో పాటుగా, ప్రతిపక్షాలు కూడా ఆరోపించారు. దీంతో ప్రభుత్వం విశాఖ లో సర్వే ను నిర్వహించారు. వీడిపి సర్వే జివీఎం పోల్ ను ప్రోజెక్ట్ చేసింది. ఆ సర్వే ప్రకారం మళ్లీ ఎన్నికలు జరిగితే.. వైసీపీ కి 49.8,టీడీపీ కి 36.5 ఇతరుల కు 5 శాతం, జనసేన కు 4.1, బీజేపీ కి 2.8, కాంగ్రెస్ కు 1.7 శాతం మాత్రం ఓట్లు వస్తాయని వెల్లడించింది.. ఒకవేళ టీడీపీ తో ఇతర పార్టీలు మమెకమైతే రిజల్ట్ పూర్తిగా మారిపోతుంది.. అంటూ సర్వే వెల్లడించింది.ఏది ఏమైనా వైసీపీ ముందంజలో ఉందని సర్వే నిర్ధారించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: