కరోనా వ్యాప్తంగా ప్రపంచం మొత్తం గత ఆరు నెలలు అంధకారంలో ఉండిపోయింది. ఎక్కడ ఎవ్వరికీ కరోనా వస్తుందో అని తేల్చుకోలేని పరిస్థితి.. అంటు వ్యాధిలా వ్యాపిస్తున్న ఈ కరోనా వల్ల ప్రజలు అనే సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కరోనా సమయంలో పెరిగిన కూరగాయలకు , నిత్యావసర వస్తువుల ను కొనడానికి సామాన్యుడి గుండె బరువెక్కింది. చేతి లో పని లేదు.. జీతాలు లేవు అలాంటి తరుణంలో ఇలా ఉండటం తో చాలా మంది కుటుంబాన్ని పోషించడానికి కష్ట మవ్వడంతో తనువు చాలిస్తున్నారు. అలా కరోనా వల్ల అన్నీ నష్టాలే ఎదురైయ్యాయి.



ఇటీవల మధ్యతరగతి కుటుంబాల పరిస్థితిని పరిగణ లోకి తీసుకుని లాక్ డౌన్ లో సడలింపులను చేశారు. అనంతరం వ్యాపారాలను యదావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి కూడా అనుమతులు మంజూరు చేయడంతో సినిమాలను తెరకెక్కించే పనిలో దర్శక నిర్మాతలు బిజీగా ఉన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. అయితే థియేటర్లను అక్టోబర్ 15 నుంచి తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన కూడా థియేటర్ యాజమాన్యాలు మాత్రం అందుకు సిద్దంగా లేరని తెలుస్తుంది.



అసలు విషయానికొస్తే.. థియేటర్ యాజమాన్యాలు చర్చలు జరిపి థియేటర్లను తెరవకూడదు అనే నిర్ణయానికి వచ్చారు. ఒక వేళ వాళ్ళు తెరవాలని అనుకున్నా కూడా అందుకు అదనపు పడి లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అదనపు విద్యుత్ చార్జీలను భరించాలి. విద్యుత్ చార్జీలు ఎత్తివేయాలని థియేటర్స్ యాజమాన్యాలు కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు టికెట్ చార్జీలను పెంచితెనే నష్టాలు కొంత వరకు తగ్గుతాయని యాజమాన్యాలు ఆలోచిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల రెట్లు పెంచితేనే ఎవరు రాలేదు. అలాంటిది ఇప్పుడు చిన్న సినిమాలకు పెంచితే జనాలు వస్తారా అనే ఆలోచనలో ఉన్నారట.. మరి ఈ విషయం పై మోదీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: