టూరిజం పై కేంద్ర  పర్యాటక శాఖ  సహాయ మంత్రి  ప్రహ్లాద్ సింగ్  పటేల్   వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ అభివృద్దిపై తీసుకోవాల్సిన చర్యలను ఆయన పలు రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రులను అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా పలు రాష్ట్రాలు చేపడుతున్న చర్యలను ఆయన అభినందించారు కూడా. సముద్ర తీర నగరాల్లో చేస్తున్న అభివృద్ధి గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి ఏపీ నుంచి ఈ వీడియో కాన్ఫెరెన్సు లో పాల్గున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు రాష్ట్రంలో తీసుకునే చర్యల గురించి వివరించారు.

కోవిడ్ నేపథ్యంలో టూరిజం స్పాట్స్ కి వచ్చే సందర్శకులకు తీసుకోవాల్సిన చర్యలు పై చర్చించాం అని ఆయన అన్నారు. కోవిడ్ నిబంధనలు తు చ తప్పకుండా పాటిస్తున్నాం అని స్పష్టం చేసారు. రాష్ట్రం నుంచి వెయ్యికోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టులకు ప్రతిపాదన లు పంపాము అని ఆయన మీడియాకు వివరించారు. స్వదేశీ దర్శనం పధకం,  ప్రసాదం స్కీం ప్రవేశ పెట్టాము అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నాలుగు దేవాలయాలకు ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపగా.. సింహాచలం ప్రాజెక్టు కు ప్రసాదం పథకం అమోదం లభించింది అని ఆయన అన్నారు.


కేంద్ర సహకారం తో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన మీడియాకు వివరించారు. రిషికొండ బీచ్ కి బ్లూ ఫాగ్ గుర్తింపు రావడం ఆనందదాయకం అని ఆయన వివరించారు. వచ్చే వారం  నూతన టూరిజం పాలసీ ని ప్రకటిస్తామని మంత్రి అన్నారు. విదేశీ పర్యాటకులు సందర్శించే రూపకల్పన చేస్తామని వివరించారు. కాగా దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా పర్యాటక రంగం ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు పరిస్థితి చాలా ఆందోళన కలిగించే విధంగా తయారు అయింది అనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: