ఎగువన భారీ వర్షాలు పడుతున్న నేపధ్యంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కావాలని అధికారులు సూచించారు.  కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు పెద్ద ఎత్తున హెచ్చరికలు చేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నదికి  పెరుగుతున్న వరద  ఉధృతి కారణంగా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ప్రకాశం బ్యారేజ్ కు సుమారు 9 లక్షల క్యూసెక్స్ వరకు వరద నీరు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు.  వరద ఉధృతి పై అధికారులను  మరింత అప్రమత్తం చేసారు కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ యండి ఇంతియాజ్.

ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్ట్ వద్ద  నిన్న 7.50 లక్షల క్యూసెక్కుల  అవుట్ ఫ్లో ఉంది. మ 1.30 కు 8 లక్షలకు చేరుకుందని చెప్పారు. నదీ పరివాహక ప్రజలు నివాస ప్రాంతాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెల్లాలని హెచ్చరించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని సూచించారు.  పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. ప్రకాశం బ్యారీజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 22 పునరావాస కేంద్రాల ను ఏర్పాటు చేసారు. చేపల కోసం ఎవరూ కూడా నదిలోకి వెళ్ళవద్దు అని అధికారులు స్పష్టం చేసారు.

ప్రస్తుతo  ఇన్ ఫ్లో 6,36,921 అవుట్ ఫ్లో 6,32,961 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత   అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ ఏ యండి ఇంతియాజ్... కీలక సూచనలు చేసారు. జగ్గయ్యపేట  నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహసీల్దార్ లు  అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చిన లంక, పెద లంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం  లాంటివి చేయరాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: