తెలంగాణ రాష్ట్రం కరోనా కారణంగా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం. చాలా కులాలు, మతాల వాళ్ళు ఇక్కడే ఉంటూ ఏదోక పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.అలాంటి హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది..కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో వాణిజ్య, వ్యాపారాలు పూర్తిగా మూత పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో చేతి కూలి చేసుకొనే వారికి పెద్ద దెబ్బ పడిందని తెలుస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఇళ్ళ లోంచి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు.


ఇక జీతాలు లేక , తినడానికి తిండి లేక ప్రజలు ప్రాణాలతో పోరాడారు. పేద ప్రజలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వచ్చారు. అయితే ఐదు నెలల వరకు కొనసాగిన ఈ లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు కరోనా కేసులు కాస్త ఊరట నివ్వడం తో మళ్లీ కొంత వరకు ప్రజలు పనులు చేసుకుంటున్నారు. అసలు విషయానికొస్తే.. ఇటీవల మెట్రో ను పునః ప్రారంభించడానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మెట్రో రైలు మొదలైన కొద్ది రోజులకే భారీ వర్షాలు నగరాన్ని ముంచేసాయి.


ఇలాంటి పరిస్థితి నుంచి ప్రజలను ఆకర్షించడానికి మెట్రో ప్రయాణికులకు భారీ  డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది..చార్జీల్లో రాయితీ ప్రకటించారు. మెట్రో సువర్ణ ఆఫర్ పేరుతో అప్ టు 40 శాతం వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్స్‌ను ప్రయాణికులకు అందిస్తున్నట్లుగా హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 17 నుంచి ఆ ఆఫర్లు వర్తించనున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..


7 ట్రిప్పులకు ఛార్జీ  చెల్లిస్తే .. 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం

14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ..45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ...45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే... 45 రోజుల్లో 45  ట్రిప్పులు తిరిగే అవకాశం

40 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే.. 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరగవచ్చునని అధికారులు వెల్లడించారు.

రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని మెట్రో అధికారులు వెల్లడించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: