గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలా అయినాసరే విజయం సాధించాలని కష్టపడుతున్న టిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఇప్పుడు కొంతమంది నేతల తీరు చాలా ఇబ్బందికరంగా మారింది. ఒకపక్కన కరోనా వైరస్ తగ్గుతున్న సరే ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా స్థానిక నాయకులు ప్రజల్లోకి వెళ్లడానికి ముందుకు రావడం లేదు. దీనితో అంతిమంగా పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే కొంతమంది జాబితాని తెప్పించుకొని దానిని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్న నేపథ్యంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా సరే కొంతమంది మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం అనూహ్యంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి మంత్రి కేటీఆర్ కూడా గ్రేటర్ ఎన్నికల విషయంలో కాస్త ఎక్కువగానే  ఫోకస్ చేస్తున్నారు.

వరద బాధిత ప్రాంతాల్లో ఆయన మూడు రోజుల నుంచి వరుసగా పర్యటనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల కష్టాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది నేతలు మాత్రం ప్రజల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఒక మంత్రిగారు అయితే ప్రజల్లోకి రావడానికి బాగా కష్ట పడుతున్నారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనితో ఆ మంత్రికి స్వయంగా కేటీఆర్ ఫోన్ చేశారని ఆయనను ప్రజల్లోకి వెళ్లకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారని తెలుస్తోంది. మరి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలా టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం నిర్వహిస్తారు అనేది చూడాలి. నవంబర్ లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: