ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో దేశం మొత్తం కూడా చాలావరకు ఆసక్తిగా ఎదురుచూస్తుంది. రాజకీయంగా సీఎం జగన్ బలంగా ఉండటంతో సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. విపక్షాలు కోర్టుల్లో కేసులు వేస్తున్నా సరే సీఎం జగన్ మాత్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసమే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి తీరుతాను అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల విషయంలో ఏ స్పష్టత కూడా రావడంలేదు.

కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఇళ్ల పట్టాల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేదానిపై కాస్త ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ప్రస్తుతం కోర్టులో కేసు ఉండటంతో సీఎం జగన్ ఎలా వ్యవహరిస్తారు అనేదాని పైన అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే సీఎం జగన్ కు ఇళ్ల పట్టాల విషయంలో మద్దతు వచ్చింది అని సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ సీఎం జగన్ ఇళ్ల పట్టాలు విషయంలో మద్దతు ఇచ్చారని అంటున్నారు. అయితే న్యాయసహాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా లేదా అనేది స్పష్టత లేదు.

కానీ రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలు మాత్రం ఇళ్ల పట్టాలు విషయంలో ఎలాంటి ఆరోపణలు చేయవద్దని బీజేపీ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా బలపడటానికి కొన్ని కొన్ని వ్యవహారాల విషయంలో దూరంగా ఉండాలని చెప్పారట. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా అయినా అండగా నిలబడితే మంచిది అనే భావన బిజెపి పెద్దలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఎలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయి అనేది చూడాలి. ప్రస్తుతం హైకోర్టు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా ఇళ్ల పట్టాల గురించి హోంమంత్రి అమిత్ షా వద్ద కూడా ప్రస్తావించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: