కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఎపుడూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. గడచిన ఆరేళ్ళ కాలంలో కూడా అనేక నిర్ణయాలు మోడీ ప్రధానిగా తీసుకున్నారు. ఇపుడు కూడా అలాంటి  నిర్ణయమే మరొకటి  ఆయన వెలువరించే అవకాశాలు ఉన్నాయి. అదేంటి అంటే ఏకంగా భారతీయ వివాహ వ్యవస్థలోనే పెను మార్పులు తీసుకువచ్చేలా మోడీ నిర్ణయం ఉంటుందని అంటున్నారు. భారతీయ ధర్మంలో బాల్యంలోనే వివాహం చేయమని ఉంది. అంటే కన్యగా ఆమె మారాక ఒక అయ్య చేతిలో పెట్టేయడమే ధర్మ చెప్పే నీతి.

అయితే కాలం మారింది. పరిస్థితులు మారుతున్నాయి. ఒకపుడు ఆడవారికి అసలు చదువులు లేవు, తరువాత రోజుల్లో చదువులే కాదు, ఉద్యోగాలు చేస్తున్నారు. మగాళ్లతో సమానంగా రాణిస్తున్నారు. ఈ నేపధ్యం నుంచి చూస్తే ఆడవారి చదువులు పెళ్ళి అడ్డువస్తోందని గత ప్రభుత్వాలు కూడా భావించాయి. అందుకే వివాహ వయసుని 18 ఏళ్ళకే నిర్ణయించారు. అంటే అప్పటికి ఆమె యుక్తాయుక్త విచక్షణ తెలుసుకుంటుందని భావించి అలా చేశారు.

ఇపుడు మరింత ఆధునిక కాలంలోని అంతా వచ్చేశాం. దాంతో ఆ వయసు కూడా సరిపోవడంలేదు. అందువల్ల ఆడపిల్ల వివాహ వయసుని దేశంలో పెంచాలని మోడీ సర్కార్ గట్టిగా భావిస్తోందిట. అంటే ఇది కచ్చితంగా మూడు నాలుగెళ్ళకు పెరుగుతుంది అంటున్నారు. 22 ఏళ్ళ వరకూ ఆడపిల్ల పెళ్ళి ఊసు తల్లిదండ్రులు ఎత్తకుండా ఆమె కోరిన రంగంలో సెటిల్ అయ్యేలా చూడాలన్నదే ఈ చట్ట సవరణలో మార్పుల ఉద్దేశ్యమని అంటున్నారు.

మరి ఈ దేశంలో ఇంకా చట్టాల కంటే ధర్మాలనే అనుసరిస్తున్నవారు ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువ. అక్కడే బాల్య వివాహాలు చాలా జరుగుతున్నాయి. చట్ట సవరణలు చేయడం తో పాటుగా చైతన్యం జనాల్లో కలిగిస్తేనే పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయని మేధావులు  అంతా అంటున్నారు. మరి చూడాలి ఎలా చేస్తారో. ఏది ఏమైనా ఇది మంచి నిర్ణయమేనని ఆడపిల్లల తల్లిదండ్రులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: