ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కొంతమంది అండ చూసుకునే వారు క్షేత్ర స్థాయిలో ప్రజలను కూడా ఒకరకంగా ఇబ్బంది పెడుతున్నారు అనే ఆరోపణలు కూడా సీఎం జగన్ వద్దకు వచ్చాయి. ఇక క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారులను అడ్డంపెట్టుకుని కొంతమంది వ్యవహరిస్తున్న తీరుపై సీఎం జగన్ చాలావరకు సీరియస్ గా ఉన్నారు. రాజకీయంగా పార్టీ బలంగా ఉన్న సమయంలో ఇలాంటి చర్యలు చాలా చిరాగ్గా ఉంటాయి.

అయినా సరే కొంతమంది మాత్రం మారడం లేదు. దీనితో సీఎం జగన్ కొంతమందికి తన మార్కు ట్రీట్మెంట్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఎవరైతే క్షేత్రస్థాయిలో పార్టీని ఇబ్బంది పెడుతున్నారో వారందరి మీద కూడా ఆయన ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచినట్టుగా తెలుస్తుంది. పార్టీలో అసంతృప్తి అనేది లేకుండా చాలా వరకు జాగ్రత్తగా పదవుల విషయంలో కూడా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. మంత్రులు కావాలి అని భావించిన వారికి కూడా భవిష్యత్తులో మంత్రి పదవులు ఇవ్వడానికి సీఎం జగన్ రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది నేతలు మాత్రం పదవులు రాలేదని క్షేత్ర స్థాయిలో తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడంపై సీఎం జగన్ చాలావరకు సీరియస్ గా ఉన్నారు.

ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి రాలేదని భావించిన ఒక కీలక నేత ఉత్తరాంధ్రలో పార్టీని ఇబ్బంది పెడుతున్నారని సమాచారం సీఎం జగన్ కు అందింది. దీంతో ఆయనను పదవి నుంచి తప్పించి ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారట. ప్రస్తుతం ఆయన స్థానంలో ఆ పదవిలో మరొకరిని కూర్చో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల కొన్ని రాజధాని అంశానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా సీఎం జగన్ వద్దకు వెళ్ళాయి. రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ కూడా కాస్త సీరియస్ గా ఉన్నారట. మరి ఆ నేత ఎవరు ఏంటి అనేది త్వరలోనే బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: