నేటి సమాజంలో ప్రజలు పనుల ఒత్తిడిలో పడి ఇల్లు శుభ్రం చేసుకునే టైమ్ కూడ దొరకడం లేదు.ఇదే అదనంగా చూసుకొని బొద్దింకలు ఇళ్లలో చేరుతాయి. చాలామంది ఇళ్లల్లో కిచెన్‌లో బొద్దింకల సమస్య ఉంటుంది. బొద్దింకలను వెళ్లగొట్టడానికి బయట చాల మార్కెట్ లో క్రిమి సంహరణ మందులు దొరుకుతాయి. కానీ అవి వాడడం వలన చిన్న పిల్లలకు ప్రమాదం వాటిల్లుతుంది. అందుకే వంటింటి చిట్కాలతో బొద్దింకలకు చెక్ పెట్టండి ఇలా.

వంటగదిలో బొద్దింకల సమస్య ఎక్కువగా ఉందా. అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి సింక్ పైప్ దగ్గరలో పెట్టండి. ఇది బొద్దింకలకు ముందుగా బాగా పని చేస్తుంది. అంతేకాదు బొద్దింకలకు చెక్ పెట్టడానికి బోరిక్ పౌడర్‌ను కూడా వాడొచ్చు. ఇక వంటింట్లో బొద్దింకలులేకుండా పోవాలంటే వంటగది మూలల్లో బోరిక్ పౌడర్‌ను ఉంచితే బొద్దింకలు అసలు కనపడవు. ఇక ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉంటే కనుక బోరాక్స్ పౌడర్‌ను ఉపయోగించడం అసలు మంచిది కాదు. దానికి బదులు అప్పుడు పంచదార, బేకింగ్ సోడాలను  కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో వాడండి.

ఇక ఉల్లిపాయలో సహజంగా ఘాటైన వాసన ఉంటుదన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఉల్లిపాయల నుండి రసం తీసుకోని బొద్దింకలు తిరుగుతున్న ప్రాంతాల్లో చల్లడం లేదా పిచికారీ చేయాలి. ఇలా చేయడం వలన బొద్దింకలను నివారించడంతో పాటు మరే ఇతర క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా చేస్తాయి. అంతేకాదు కాఫీ గింజలను వంటగది అలమరలలో, అక్కడక్కడా ఉంచడం ద్వారా ఆ వాసనకు  బొద్దింకలు ఇంట్లోకి రావు అని నిపుణులు తెలివారు. ఇక నిమ్మ తొక్కలను వాడేసిన తర్వాత అలమరల్లో ఉంచడం ద్వారా బొద్దింకల బెడద తప్పుతుంది. బొద్దింకలు తిరిగే ప్రదేశంలో బిర్యానీ ఆకులను పౌడర్ చేసి చల్లడం వల్ల ఆ వాసన కి బొద్దింకలు  చచ్చిపోతాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: