దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితంపై రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాలే కాదు.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నాయి. దుబ్బాక ఫ‌లితాన్ని బ‌ట్టే రాజ‌కీయ ప‌వ‌నాల‌ను అంచ‌నా వేయ‌వ‌చ్చ‌న్న‌ది ఈ రెండు రాజ‌కీయ పార్టీల భావ‌న‌. వాస్త‌వానికి కూడా అది నిజ‌మే. ఉప ఎన్నిక‌ను టీఆర్ ఎస్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటోంది. సోలిపేట సుజాత గెలుపు బాధ్య‌త‌ల‌ను ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు పూర్తిగా త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే ఇక్క‌డి నుంచి రెండు మార్లు పోటీ చేసి ఓట‌మిపాలైన బీజేపీ అభ్య‌ర్థి, రాజ‌కీయ విశ్లేష‌కుడు ర‌ఘునంద‌న్‌రావు బ‌రిలో ఉండ‌టం, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముత్య‌రెడ్డి వార‌సుడిగా చెరుకు శ్రీనివాస‌రెడ్డి బ‌రిలోకి దిగ‌డంతో పోటీ ర‌స‌క‌దాయంగా మారింది.


రాజ‌కీయ పార్టీల బ‌లాబ‌లాలు స‌మంగా ఉన్నాయ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ జెండా ఎగుర‌వేసింది. ముత్యంరెడ్డికి ఇక్క‌డ మంచి పేరు ఉండ‌టం శ్రీనివాస‌రెడ్డికి బాగా క‌లిసి వ‌చ్చే అంశ‌మ‌ని చెప్పాలి. ఇక బీజేపీ ర‌ఘునంద‌న్‌రావుకు ప్ర‌శ్నించే త‌త్వం క‌లిగిన వ్య‌క్త‌ని, టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ లోపాల‌ను ప్ర‌జాక్షేత్రంలోకి తీసుకెళ్లి ప‌రిష్క‌రించే సామ‌ర్థ్యం, తెలివి తేట‌లున్నా నేత‌గా కొన్ని వ‌ర్గాల్లో బ‌ల‌మైన న‌మ్మ‌కం ఉంది. ముఖ్యంగా వ్యాపార‌, వాణిజ్య వ‌ర్గాల్లో ఆయ‌న‌కు ప‌ట్టు ఉంద‌నే చెప్పాలి. ఇక టీఆర్ ఎస్ అభ్య‌ర్థి సుజాత‌కు పార్టీ బ‌లంతో పాటు భ‌ర్త చ‌నిపోయాడు కాబ‌ట్టి ఆమెను గెలిపించాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌నే సెంటిమెంట్ జ‌నాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.



ఆమెకు రెండు అంశాలు అనుకూలంగా ఉంటాయ‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా. మిగ‌తా పార్టీల‌తో పోల్చితే టీఆర్ ఎస్‌కే ఎడ్చ్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో యువ‌త ఓట్లు కీల‌కం కానున్నాయ‌ట‌. మొత్తం ఓట్లో దాదాపు 10శాతం వీరివే ఉండ‌టం గ‌మ‌నార్హం. నియోజకవర్గంలో మొత్తం 1,97,468 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 20 వేల మేరకు యువత ఓట్లు ఉన్నాయ‌ని ఓట‌ర్ జాబితాను బ‌ట్టి తెలుస్తోంది. ఇందులో ఇటీవల కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా ఓటు పొందిన వారు 5 వేల మేరకు ఉన్నారు. ఇందులో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులతో పాటు, వ్యవసాయం, ఇతర పనులు చేసుకునే వారు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: