ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కరోనా  వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రకంగా పంజా విసురుతోంది. ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది ఈ మహమ్మారి వైరస్. ఇక ఈ మహమ్మారి వైరస్ గురించి భయపడటం మాని  ప్రపంచం మొత్తం సహజీవనం చేయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అదే క్రమంలో మరింత శరవేగంగా కోరలు చాస్తున్న ఈ మహమ్మారి వైరస్... ఎంతో మందిని బలి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రజానీకం మొత్తం ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి  ఈ మహమ్మారి వైరస్ ను అంతం చేస్తుందా అని ప్రపంచ ప్రజానీకం మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.



 అయితే ఒకవేళ వ్యాక్సిన్  వచ్చినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం ఎక్కడా తగ్గదు అని ప్రస్తుత నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మహమ్మారి వైరస్ మళ్లీ పునరావృతం అవుతోందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి అన్ని విషయాలపై ఇప్పటికే కూడా స్పష్టత లేదు అన్న విషయం తెలిసిందే.



 వ్యాక్సిన్  వచ్చినప్పటికీ సాధారణ ఫ్లూ  లో మాదిరిగానే కరోనా  మారే అవకాశం ఉంది నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ రీ ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్ లభ్యత,  సమర్థత, సీజనాలిటీ వంటి అంశాలను కూడా దీనికి కారణాలుగా చెబుతున్నారు పరిశోధకులు. ఇక వైరస్ బారిన పడినప్పటికీ వ్యాక్సిన్  లభించిన రోగనిరోధకశక్తి ఒక సంవత్సర కాలంలో తగ్గిపోయే అవకాశం ఉంది అనే కోణంలో ఇటీవల ఒక పరిశోధన సాగించారు. వ్యాక్సిన్  ద్వారా సంక్రమించిన రోగ నిరోధక శక్తి స్వల్ప కాల మే రక్షణ కలిపిస్తుంది అనే విషయాలు తాజాగా పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో  స్పష్టం వెల్లడైనట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. అందుకే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా  మహమ్మారి ఎండమిక్ గా మారుతుందని అమెరికా ఫార్మా సంస్థ సీఈవో అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: