ఆంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు అంశం రోజురోజుకు హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది. అధికార వైసిపి పార్టీ కి రఘురామకృష్ణంరాజు తీరు రోజురోజుకు కొరకరాని కొయ్యగా మారి పోతుంది. పక్షాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న అధికార పార్టీకి... రఘురామకృష్ణంరాజు విమర్శలు కొత్త ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి . ఈ క్రమంలోనే రఘురామకృష్ణంరాజు పై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్దమైన విషయం తెలిసిందే.



 ఇక ఇటీవలే రఘురామకృష్ణంరాజు కు భారీ షాక్ తగిలింది. సబార్డినేట్ లెజిస్లేచర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును  తపిస్తూ లోక్సభ స్పీకర్ సచివాలయం ఉత్తర్వులు జారీ చేయడంతో రఘురామకృష్ణంరాజుకు భారీ షాక్ తగిలింది. దీంతో వైసీపీతో కయ్యం పెట్టుకున్నప్పటికీ తన పదవికి ఎలాంటి డోకా లేదు అంటూ విమర్శలు చేస్తూ వస్తున్న రఘురామకృష్ణంరాజు ఇది ఊహించని షాక్ అని చెప్పాలి. ఇక సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్గా మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి నియమితులు కావడం గమనార్హం. 9వ తేదీ నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని లోక్సభ సచివాలయం స్పష్టం చేసింది.




 ముఖ్యంగా రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు మీడియా సమావేశం నిర్వహిస్తూ ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను సైతం తెరమీదికి తెచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ క్రమంలోనే పలుమార్లు వైసీపీ కీలక నేతలు ఆయనతో చర్చలు జరిపినప్పటికీ ఆయన తీరులో  మాత్రం మార్పు రాలేదు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు రఘురామ కృష్ణం రాజు పై చర్యలు తీసుకోవాలా వైసిపి అధిష్టానం కూడా ఎదురు చూస్తుంది. ఇక  పార్లమెంటులో రఘురామ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వైసిపి ఎంపీలందరూ స్పీకర్ ఓం  బిర్లా ను కోరిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: