ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఒకటిగా కలిసి ఉన్నప్పుడు ఏపిని డెవలప్ చేయడం కన్నా కూడా తెలంగాణ హైదరాబాద్ ను అభివృద్ది చేశారు. అది వాస్తవం. మెట్రో సిటీ గా ఉన్న ఈ నగరాన్ని వాణిజ్య ప్రయోగాలకు, ఆర్దికంగా లాభపడటం కోసం ఇక్కడ అన్నీ రకాల సంస్థలను, వ్యాపారాలను, ముఖ్యంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సినీ రంగానికి సంబందించిన అన్నీ సదుపాయాల ను హైదరాబాద్ లో ఉంచారు. అలా హైదరాబాద్ ఇప్పుడు మహా నగరంగా పేరు తెచ్చుకుంది.




తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత అన్నీ రకాలుగా డెవలప్ చేసిన హైదారాబాద్ తెరాస నేతలు సొత్తు అయ్యింది.ఇక్కడ సొంతంగా వ్యాపారాలు చేసుకొనే నాయకులు తప్ప మిగిలిన అన్నిటి మీద సర్వహక్కులు తెలంగాణ సర్కార్ కు చెందాయి. ఆంధ్రా వాసులు చేసేదేమీ లేక ఉన్న వాటిని అభివృద్ది చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో అన్నీ రకాల కంపెనీలను స్టార్ట్ చేసి మళ్లీ రాష్ట్రాన్ని ఆర్ధిక లాభాల్లో నిలబెట్టే పనిలో ఉన్నారు. విశాఖ లో కూడా హైదరాబాద్ లో సమానమైన విద్యా, వాణిజ్య, వైద్య రంగాలకు చెందిన వాటిని అభివృద్ది చేసిన కూడా హైదారాబాద్ మీద ఆధారపడటం మాత్రం మానలేదు.



ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆసుపత్రులు.. ఆంధ్రా వాసులకు ఏదైనా పెద్ద రోగం వచ్చిందంటే ఛలో హైదరాబాద్ అంటున్నారు. అలాంటి సదుపాయాలు ఆంధ్రలో లేకనా? లేదా ఇక్కడకు వెళ్ళాలి అని వస్తున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. హైదరాబాద్ లో ఉన్న ఒక్క యశోద హాస్పిటల్స్ తప్ప మిగిలిన పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఆంధ్రలోని వాల్లవే.. మరి  ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఆంధ్రలోని నాయకులు ఆలోచించాలి అంటూ ప్రజలు అంటున్నారు. హైదరాబాద్ మీద ఆధారపడాల్సిన దౌర్భాగ్యం నుంచి బయటకు వస్తే మంచిదని అంటున్నారు.. మరి ఈ విషయాన్ని ఆంధ్ర నాయకులు ఏ విధంగా పరిగణలో కి తీసుకుంటారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: