ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ కస్టమర్లను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బ్యాంకు లు  కీలక నిర్ణయాలు తీసుకుంటూ వినూత్నమైన సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను కూడా ఆవిష్కరించడం తో... ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇక డోర్ స్టెప్ సర్వీసులలో  భాగంగా బ్యాంక్ కస్టమర్ లకు ఎంతో ప్రయోజనకరం ఉండనున్న  విషయం తెలిసిందే. కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య కస్టమర్లు  బ్యాంకు కు వెళ్లకుండానే డబ్బులు పొందేందుకు అవకాశం ఉంది.



 ఎస్బిఐ ఆంధ్ర బ్యాంక్ సహా ఇతర ప్రభుత్వ బ్యాంకులు అన్నీ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. వికలాంగులు సీనియర్ సిటిజన్స్ కి  డోర్ స్టెప్ ద్వారా ఇంటికి పలు రకాల సేవలు అందించేందుకు ప్రస్తుతం బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. డోర్ స్టెప్ సర్వీస్ లో కోసం బ్యాంకు కస్టమర్లు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ బ్రాంచ్ కు ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కస్టమర్ల చిరునామాకు డోర్ స్టేట్ బ్యాంక్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఎస్ఎంఎస్ ద్వారా ఈ డోర్ స్టెప్ సర్వీస్ యాక్టివేట్ చేసుకునేందుకు అవకాశముంటుంది.



 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి  ఈ సరి కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. స్టేట్ బ్యాంక్ కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఈ డోర్ స్టెప్ సేవలను ఆక్టివేట్ చేసుకోవచ్చు. నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లు  కూడా ఈ డోర్ స్టెప్ లో భాగంగా పొందవచ్చు. అయితే ఎస్బిఐ ఈ సర్వీసులకు గానూ వంద రూపాయల వరకూ ఛార్జీలను వసూలు చేస్తుండగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 వరకు చార్జీలు వసూలు చేస్తుంది కానీ ఆంధ్ర బ్యాంకు మాత్రం కేవలం 75 రూపాయలు మాత్రమే సర్వీసుల కోసం చార్జీలు వసూలు చేస్తూ ఉండడం గమనార్హం.  డోర్ స్టెప్ బ్యాంక్ సర్వీస్ ద్వారా 5 వేల నుంచి 25 వేల వరకు నగదు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: