బాదం ఎంత ఆరోగ్యమో మన అందరికి తెలుసు. చాల మంది రోజు బాదంని తింటూ ఉంటారు. మన శరీరానికి కృత్తిమంగా తయారైన ఆహార పదార్థాల కంటే కూడా ఇవి ఎంతో ఆరోగ్యం. కాబట్టి వీలైనంత వరకు కూడా  సహజ సిద్ధంగా తయారైన ఆహారాన్ని తీసుకోవడమే ఎంతో మేలు. బాదంను ఒక పూట నానబెట్టి పొట్టు తీసి తీసుకుంటే మరీ మంచిది . బాదంను అలా తీసుకోవడం ఇష్టం లేని వారు బాదం పాలను తీసుకోవచ్చు. బాదం పప్పు వల్ల లాభాలు ఏమిటి అంటారా.. ?  శారీరక ఆరోగ్యానికి , మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది.  

ఇక బాదం పాలు విషియానికి వస్తే.... బయట సూపర్ మార్కెట్ ల లో మనకు బాదం పాలు లభిస్తాయి. అలా కొన్న వాటి కంటే కూడా ఇంట్లో సొంతంగా  చేసుకున్నావే మంచిది. మరి అవి ఎలా చెయ్యాలి..? ఎంతో కష్టం అని అనుకోకండి. చాలా సులువుగా మనమే తయారు చేసుకోవచ్చు. ప్రతి రోజూ కాక పోయినా వారానికి ఒకటి లేదా రెండు సార్లు బాదం పాలు తీసుకున్నా మంచిది. పన్నెండు గంటలు నానబెట్టిన బాదం పప్పును నాలుగు కప్పుల నీళ్లు పోసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టి పల్చని వస్త్రం లో వడబోస్తే బాదం పాలు రెడీ.
 
వీటిలో మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కేలరీలు తక్కువగా లభించే బాదం పాల లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. చూసారా ఎంత ఆరోగ్యమో. రోజూ బాదం పాలు తాగే వాళ్లలో కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. అలానే  గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పాల లో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటంతో పాటు సోడియం తక్కువగా ఉంటుంది. ఇలా చేసి దీనిని తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి మీరు కూడా ఇలా అనుసరించండి ఆరోగ్యంగా ఉండండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: