దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అన్లాక్ మార్గదర్శకాలు విడుదల అయిన నేపథ్యంలో అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి మరింత శర వేగంగా జరుగుతూ ఉంది. దీంతో రికార్డు స్థాయిలో కరోనా కేసుల సంఖ్య నమోదు అవుతుంది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ప్రజలు కూడా కరోనా వైరస్ నియంత్రణకూ  కోసం ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతుంది. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో దేశ ప్రజానీకం మొత్తం ఆందోళనలో మునిగిపోతుంది.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భారత్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప కరోనా వైరస్ నియంత్రణ సాధ్యం కాదు అనే పరిస్థితులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవ్యాక్సిన్  పైనే ఎక్కువగా ఆశలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవ్యాక్సిన్ శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటుంది. ఇక క్లినికల్ ట్రయల్స్ లో కూడా సత్ఫలితాలు వస్తుండడంతో భారత ప్రజలందరిలో కొత్త ఊపిరి నిండిపోతుంది. కరోనా వైరస్ ద్వారా కష్టాల కడలిలో బ్రతుకు వెళ్లదీస్తున్నప్పటికీ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు భారత ప్రజలు.



 ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ ఇటీవలే భారత ప్రజలందరికీ శుభవార్త తెలిపింది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నవంబర్ లో ప్రారంభం కానున్నాయి అని ఇటీవల భారత్ బయోటెక్ తెలిపింది. కోవ్యాక్సిన్ మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ లో ఎంతగానో సత్ఫలితాలు వచ్చాయి అంటూ తెలిపిన భారత్ బయోటెక్.. ఇక ఇప్పుడు మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కి సిద్ధం అయ్యాము అంటూ చెప్పుకొచ్చింది. ఇక మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా దేశంలోని 19 నగరాలలో ఏకంగా 28 వేల ఐదు వందల మందిపై  క్లినికల్ ట్రయల్స్ జరుపుతాము అంటూ తెలిపింది భారత్ బయోటెక్.

మరింత సమాచారం తెలుసుకోండి: