ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలాకుతలమై పోయిన విషయం తెలిసిందే. భారీ వర్షంతో వరదలతో రాష్ట్రం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. పట్టణాలు నగరాలు అనే తేడా లేకుండా పూర్తిగా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక లోతట్టు ప్రాంతాల్లో అయితే జనజీవనం స్తంభించిపోయింది. ఇక భారీ వర్షానికి ఏకంగా భవనాలు సైతం కూలిపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసు. చిన్నపాటి వర్షం పడితేనే  చిగురుటాకులా వణికిపోయే  భాగ్యనగరం అతి భారీ వర్షానికి వరదల్లో తడిసి ముద్దైన విషయం తెలిసిందే.



 ఇప్పటికీ కూడా హైదరాబాద్ నగరం మొన్న కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి పూర్తిస్థాయిలో కోలేకపోతుంది. భారీ వర్షం కారణంగా వచ్చిన వరదల హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తి  జనజీవనాన్ని స్తంభింప చేశాయి. పూర్తిగా హైదరాబాద్ నగరంలోని రహదారులు కాలనీలు అన్నీ కూడా వరద నీటితో నిండి పోయి జనావాసాల్లోకి నీళ్లు రావడంతో జనజీవనం స్తంభించిపోయింది ప్రజలందరూ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎటు చూసినా పూర్తిగా వరదనీరు నిండిపోవడంతో కనీసం రక్షణ కోసం ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు నగర వాసులు.




 ఇక రాబోయే రోజుల్లో వర్షాలు పడితే హైదరాబాద్ నగర పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. ఇటీవలి వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో ఏర్పడిన పరిస్థితులపై బీట్ పరిశోధకురాలు స్వాతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న 20 ఏళ్లలో 40 నుంచి 45 సెంటీమీటర్ల వర్షం ఒకేరోజు పడే అవకాశం ఉందని.. నగరం ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్రయిన్ల  పూడిక తో పాటు వాటిని విస్తరించాలని... అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న డ్రయిన్ల సామర్థ్యాన్ని 25 నుంచి 30 శాతం వరకు పెంచినట్లయితే రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు పడినప్పటికీ హైదరాబాద్ నగరం వరదల ప్రమాదం నుంచి బయట కలుగుతుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: