దేశవ్యాప్తం గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల
కు పలు రాష్ట్రాలు అతలాకుతలమై పోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అయితే మొన్న కురిసిన భారీ వర్షానికి పూర్తిగా రాష్ట్రం మొత్తం వరద ల్లో తడిసి ముద్దయింది. మొన్నటి  భారీ వర్షంతో వచ్చిన వరదల  నుంచి ఇప్పటికి కూడా రాష్ట్రం తేరు  కోలేక పోతుంది. భారీ వర్షం కారణంగా పంట నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇప్పటికే కరోనా  వైరస్ తో పోరాటం చేస్తూ.. బిక్కు బిక్కు మంటూ బ్రతుకులు వెళ్ళదీస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజానీకాని కి ఇప్పుడు వర్షాలు కూడా పగబట్టినట్లుగా వర్షాలతో ముంచెత్తుతున్నాయి.



 దీంతో రాష్ట్ర ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం కారణంగా దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి  అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. దీంతో మొన్న భారీ వర్షం కారణంగా ఏర్పడిన వరదల నుండి    ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాలు తేరుకోలేక  పోతున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం మరో అల్పపీడనం హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు



 మహారాష్ట్ర తీరానికి దగ్గరలో అరబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమక్రమంగా ఎంతో తీవ్రంగా మారుతుంది అని.. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరింత తీవ్రమై వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది అంటూ తెలిపారు. ఈ ఆవర్తనం  నుంచి బంగాళాఖాతం వరకు ఏకంగా 15 వందల కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: