దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీకి ఇప్పుడు రాష్ట్రంలో కాస్త క్రేజ్ పెరిగే అవకాశాలు ఉండవచ్చు. దీనితో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. అయితే పరిస్థితులు అంతగా కలిసి రావడం లేదు. దీనితో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సహాయం తీసుకోవాలని రాష్ట్ర పార్టీ నేతలు కాస్త ఎక్కువగానే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి గాను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని ప్రచారానికి ఆహ్వానించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

త్వరలోనే ఆయన పర్యటనకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ అంత అవసరమా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో అనేది చూడాలి. అయితే తెరాసను ఇబ్బంది పెట్టాలి అంటే మాత్రం రాహుల్ గాంధీ పర్యటన కి వస్తే బాగుంటుంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఒక అసెంబ్లీ స్థానం కోసం జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి వస్తారా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

అయితే రేవంత్ రెడ్డి సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వాళ్లు అందరూ ఇప్పుడు రాహుల్ని ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీకి ఆహ్వానం ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తోంది. మరి ఆయన ప్రచారం చేస్తారా లేదా అనేది చూడాలి. టిఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే త్వరలోనే సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: