తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ గతంలో మాదిరిగా బలంగా లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా నాయకత్వ సమస్య అనేది కాంగ్రెస్ పార్టీని చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. కొంతమంది నాయకులు వేరే పార్టీ లోకి వెళ్లి పోవడం కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బాగా ఇబ్బంది పెట్టే పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బలపడాలంటే కొంతమంది కీలక నేతలకు మంచి పదవులు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది.

ప్రధానంగా కార్యకర్తల ఆలోచన తెలుసుకొని పార్టీ ముందుకు వెళ్లకపోతే మాత్రం అనవసరంగా ఇబ్బందులు పడవచ్చు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి వంటి వారికి కీలక పదవి ఇచ్చిన సరే వారికి తగిన విధంగా ప్రోత్సాహం లేదు అనే భావన కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే ఎక్కువగా వ్యక్తమవుతుంది. దీంతో ఇప్పుడు కార్యకర్తలు ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నడుచుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత మంది కీలక నేతలు పని చేయడానికి ముందుకు రావడం లేదు.

దీనితో వారందరినీ కూడా మంచి పదవులు ఇచ్చి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేస్తే కొంత మంది నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి పోయే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొంత మంది ఎంపీలు కూడా రేవంత్ రెడ్డి విషయంలో సీరియస్ గానే ఉన్నారు. ఇక స్థానిక నాయకత్వం కూడా ఆయనతో కలిసి పని చేయడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి కేడర్ ఆలోచనలకు తగిన విధంగా నేతలను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: