ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ లోకి ప్రతిపక్ష నేతలు వెళ్ళడం సహజం.. ఇక ఏపీ లో అయితే ఈ చేరికల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అయితే జగన్ వీటికి చెక్ పెట్టె విధంగా రాజీనామా అనే అస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చారు.. దాంతో చాలామంది ప్రతిపక్ష నేతలు రాజీనామాలు చేయడం ఇష్టం లేక పార్టీ కి సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీ కి మద్దతు తెలుపుతూ తమ కుటుంబ సభ్యులను వైసీపీ లోకి చేర్చారు. అయితే ఇలా వచ్చిన వారు టీడీపీ  అధినేత చంద్రబాబు పై ఘాటుగా విమర్శలు చేయడం ఇప్పడు సర్వత్ర సంచలనాన్ని రేకెత్తిస్తుంది.. అంతేకాదు చంద్రబాబు చేసిన కొన్ని పనుల వల్ల వారు ఈవిధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తుంది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ నేతలు చంద్రబాబు పై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.. ఎన్నికల సమయంలో వచ్చి హడావిడి చేసి మళ్ళీ ఎన్నికల సమయంలో వస్తే ఇక్కడ పార్టీ ఎలా బలపడుతుందని అంటున్నారు.. ఇటీవలే ఇక్కడి టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిపోయిన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీకి దిక్కూ దివానం లేకుండా పోయిందంటున్నారు. అయితే ఇక్కడ పార్టీ ఇలా అయిపోవడానికి ఆనం రామనారాయణరెడ్డి కారణం కాదని చంద్రభాను అని అంటున్నారు అక్కడి ప్రజలు..

ఎప్పటికప్పుడు అభ్యర్థులను మారుస్తూ పోతుండటంతో టీడీపీకి ఇక్కడ నిలకడగల, నికార్సయిన నేత లేకుండా పోయాడంటారు. కాంగ్రెస్ నుంచి ఆనం రామనారాయణరెడ్డి రాగానే ఆయనకు బాద్యతలు అప్పగించారు. అప్పటి వరకూ పార్టీ కోసం పనిచేసిన కన్నబాబును పక్కన పెట్టేశారు. దీంతో అప్పటి వరకూ ఆయన మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చిన వర్గం ఆనం వెంట వెళ్లలేక కొందరు వైసీపీలోకి వెళ్లాంటారు. ఇక మొన్నటి ఎన్నికల్లో మరలా ఆర్థికంగా బలమైన నేత బొల్లినేని కృష్ణయ్యకు టీడీపీ టిక్కెట్ దక్కింది. ఆయనకూడా పట్టించుకోకపోవడంతో మళ్ళీ కన్నబాబే దిక్కయ్యాడు. కన్నబాబు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఆత్మకూరులో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి లీడర్ ని వదిలేసి చంద్రబాబు పదే పదే మార్చడం ఇక్కడ పార్టీ గెలవకపోవడానికి కారణం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: