కరోనా బూచి ధాటికి ప్రపంచ దేశాలు ఇంకా వణికిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులు తరువాత కరోనా వైరస్‌ మరింత ఉధృతంగా మారింది. కాగా.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా విధించిన ఆంక్షలను మరింత తీవ్రతరం చేయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం తాజాగా.. నిర్ణయించింది. అందులో భాగంగానే లండన్, టూ టైర్, త్రీ టైర్‌ నగరాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ప్రబలిన ప్రాంతాల్లో భార్యాభర్తలు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి అని బ్రిటిష్ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

అంటే వారు సెక్స్ విషయంలో దూరంగా ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసింది. అలాగే వారు ఇంట్లో కలుసుకున్నప్పుడు కూడా 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ డిమాండ్ చేసింది. ఇకపోతే సహజీవనం సాగిస్తున్న జంటలు మాత్రం ఈ నియమ నిబంధలనుండి విముక్తి పొందారు. వీరు మాత్రం భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, అలాగే లైంగిక సంబంధాలకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం లేదని వారు చెప్పడం కొసమెరుపు.

అలాగే కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించాల్సిన పని లేదని, బయటకు వెళ్లినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాటించాలని అక్కడి ప్రభుత్వం మార్గ దర్శకాల్లో స్పష్టం చేసింది. ఇక ఉద్యోగం రీత్యా బయట వున్నవారు, అలాగే వేర్వేరుగా జీవిస్తున్న భార్యాభర్తలు మాత్రం బయట కలసుకున్నప్పుడు భౌతిక దూరం పాటించాల్సిందేనని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల అక్కడి జంటలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే, తమను లైంగికంగా దూరంగా ఉండమని చెప్పే హక్కు ప్రభుత్వానికి లేదని, ఇది తమ ప్రైమసీ హక్కులకు భంగం కలిగించడమే అని వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి సమాధానంగా..  "కరోనా వైరస్‌ తీవ్రం అయిందని, కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే వారి ద్వారా వేరే వారికి సోకకుండా ఉండేందుకే ఈ నిబంధనలు." అని ప్రభుత్వ వర్గాలు సమర్ధించుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: