రాష్ట్రంలో గత వారం పది రోజుల నుండి వర్షం తీవ్రత గురించి తెలిసినదే. రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. భారీ వరదల ప్రభావంతో జన జీవన స్రవంతి పూర్తిగా స్తంభించి పోయింది. ఒక వైపు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో వైపు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వరదల ప్రభావంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాగా.. ఇంకా ఈ వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గినట్టు కనిపించడం లేదు.

ఇకపోతే, తాజాగా ఈ విషయంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించి, వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తంలో సుమారు 8 వేల ఇళ్లు నీట మునిగాయని, అలాగే 14 మంది ప్రాణాలు విడిచారని, దీనికి కారణం పూర్తిగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని మండి పడ్డారు. రాష్ట్రం నీట మునిగిపోతుంటే.. గౌరవ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ప్యాలెస్ నుంచి బయటకు రావట్లేదని దుమ్మి పోశారు.

ఈ నేపథ్యంలో, మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. లోకేశ్ పై చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నారా లోకేశ్ కు అంత పరిణితి లేదని,  ఇంకా ఎదగాల్సి ఉందని బొత్స ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వర్షాలు తగ్గకుండా నష్టాన్ని ఎలా అంచనా వేస్తుందని ప్రశ్నించారు. ఆయనకు తెలియకపోతే కనీసం పెద్దాయన్ని అడిగి తెలుసుకోవాలనే బాధ్యత ఉండాలని అని అన్నారు. అలాగే దీనికి సమాధానంగా వర్షాలు తగ్గిన తర్వాత నష్టాన్ని అంచనా వేసి, తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.

ఇకపోతే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కృష్ణా నదికి ముంచు కొస్తున్న వరద నేపధ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాలు జాగ్రత్త వహించాలని సూచించారు. అధికారులు ప్రతి నిత్యం ఆయా ప్రదేశాలపైన ఓ కన్ను వేసి ఉంచాలని, ఆపదలో వున్నవారికి సహాయ సహకారాలు అందించాలని ఆజ్ఞాపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: