ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల దుశ్చర్యలు ఆగడం లేదు. వారి చిత్రవిచిత్రమైన చర్యలతో అరాచకాలు చేస్తున్నారు.   అక్కడ ఆడవాళ్లకు కన్యత్వ పరీక్షలు చేస్తూ వారి యొక్క పైశాచికత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. తాలిబన్లు రాకముందు ఒకప్పుడు  ఆఫ్ఘనిస్తాన్ భూతల స్వర్గంగా ఉండేది. ఆడవాళ్ళ కు ఎటువంటి ఆంక్షలు ఉండేవి కాదు వాళ్లకు నచ్చినట్టు వీధుల్లో సంచేరించేవారు. వివిధ దేశాల ప్రజలు అఫ్ఘనిస్తాన్ లో ఆడవాళ్ల రాజసాన్ని చూసి ముక్కున వేలేసుకునేవారు.


అప్పటికి మన దేశ పరిస్థితులతో పోలిస్తే అంత కన్నా మూడు రెట్లు ఆఫ్ఘనిస్థాన్లోని మెరుగ్గా ఉండేది. అక్కడి ఆడవాళ్లు నచ్చిన వస్త్రాలు ధరించేవారు. గొప్ప చదువులు చదివే వారు. ఉద్యోగాలు చేసేవారు.  తాలిబన్లు రాకతో ఆ పరిస్థితులు అన్నీ మారిపోయాయి పూర్తిగా ఆడవారి వస్త్రధారణ మార్చివేశారు ఆడవారిని ఇంటికే పరిమితం చేశారు.రోడ్ల పైకి రానిచ్చేవారు కాదు చదువుకొనివ్వలేదు. ఉద్యోగాలు చేయనివ్వలేదు. ముసుగు ధరించకుండా బయటికి వస్తే తీవ్రంగా కొట్టేవారు. వారిని సెక్స్ బానిసలుగా కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో తాలిబన్ల  వ్యవస్థాపకుడైన బిన్ లాడెన్ ను అమెరికా వారు మట్టుబెట్టారు. ఆ తర్వాత అమెరికా తన కార్యకలాపాలు తగ్గించడంతో తాలిబన్లు తిరిగి తమ ఉనికిని చాటుకున్నారు. పవిత్రత పేరుతో ఈ మధ్య కొత్తగా  ఆడవారిపై శీల పరీక్షలు మొదలుపెట్టారు.


దాదాపు 95 శాతం పైగా ఆడవారికి శీల పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దీన్ని దిక్కుమాలిన చర్యగా ప్రపంచమంతా పేర్కొంటుంది. తమ రాజ్యం లో తిరిగే ఆడవాళ్ళు పవిత్రులై ఉండాలని అందుకే ఈ పరీక్షలు  చేస్తున్నారని తెలిసింది. ఈ పరీక్షలన్నీ వారి ఇష్టం లేకుండా చేసినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వం కూడా వీరి చర్యలను అడ్డుకోలేక పోతుంది. ఇది ప్రభుత్వం చేతకాని తనాన్ని సూచిస్తుంది. ఏది ఏమైనా ఏదో విధంగా తాలిబన్లు ఆడవారిపై తమ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: