తెలంగాణలో ఇప్పుడు సీఎం కేసీఆర్ ని ఎదుర్కోవాలంటే భారతీయ జనతా పార్టీ చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నేతలు ఉత్తరాది రాష్ట్రాల్లో చేసిన రాజకీయం తెలంగాణలో చేస్తే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న నేపథ్యంలో పరిస్థితులు అన్నీ కూడా ఆ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి. ప్రజల్లో కూడా పైకి చెప్పకపోయినా తెలంగాణ రాష్ట్ర సమితి మీద కాస్త సానుకూల వాతావరణం అనేది ఉంది అని చెప్పాలి.

దీనితో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలి అంటే హిందూ రాజకీయం చేస్తే మాత్రం లాభం లేదు అనే అభిప్రాయం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే నేతలు చాలామంది రాష్ట్రంలో హిందూ నాయకత్వం అనేది పెద్దగా ఉపయోగపడే అవసరంలేదని హిందూ నాయకులు వలన బీజేపీకి రాష్ట్రంలో వచ్చే ఉపయోగం ఏమీ లేదు అని అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో హిందూ వాదం అనేది పని చేసే అవకాశం ఉండదు.

ఇవన్నీ కూడా గతంలో కమ్యూనిస్టులు చక్రం తిప్పిన జిల్లాలు కావడంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు రూపొందించాలి. అంతేగాని హిందువులను ఎత్తుకునే ప్రజల్లోకి వెళ్లాలి అంటే పెద్దగా ఫలితం కనబడక పోవచ్చు. ప్రజల్లో భక్తి ఉన్నాసరే రోడ్ల మీదకు వచ్చి జై శ్రీరామ్ అనే పరిస్థితి తెలంగాణలో ఉండదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని తెలుసుకుని ముందుకు అడుగు వేస్తే మంచిది అనే భావం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రజల్లోకి ఉద్యమాలతో వెళ్ళడం మినహా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మరో మార్గం లేదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: