ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీఎం జగన్ రాసిన ఒక లేఖ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన ఆ లేఖ ఏ ఉద్దేశంతో రాశారో గాని ఇప్పుడు రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఆయనను ప్రధానంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. సీఎం జగన్ కూడా పైకి కనపడకుండా ఇబ్బంది పడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇప్పుడు ఈ లేఖ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏంటి అనే దానిపై రాజకీయవర్గాల్లో కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది.

అయితే ఇప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. వైసీపీ నేతలు కొంతమంది సైలెంట్ గా ఉండటం మంచిది అనే అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా ఇప్పుడు కొన్ని ఇబ్బందులను కొని తెచ్చుకొన్నట్టు ఉంటుందని కాబట్టి కొంత మంది వైసీపీ నేతలు న్యాయవ్యవస్థ విషయంలో వ్యాఖ్యలు చేయకుండా ఉండటం మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ విషయంలో చాలా వరకు కూడా రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉంటారు.

భవిష్యత్తులో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు వ్యవహరిస్తూ ఉంటారు. అంతేగాని సీఎం జగన్ మాత్రం కాస్త న్యాయవ్యవస్థను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో భవిష్యత్తులో ఏ విధమైన పరిణామాలు ఉంటాయో అని ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపీ సీఎం మీద కొన్ని కేసులు ఉన్న నేపథ్యంలో జగన్ కి న్యాయ వ్యవస్థతో వివాదం అనేది లేకుండా ఉండటమే మంచిది అనే భావన వ్యక్తమవుతోంది. ఆయన రాసిన లేఖ వెనక అర్ధాలు ఎలా ఉన్నా సరే కొంతకాలం పాటు మాత్రం వైసీపీ నేతలు సైలెంట్ గా ఉండక పోతే మాత్రం పరిణామాలు ఇబ్బంది పెట్టే విధంగా ఉండవచ్చు అని పలువురు హెచ్చరిస్తున్నారు. న్యాయవ్యవస్థ విషయంలో కేంద్రం కూడా సహాయం చేసే అవకాశాలు లేకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: