వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకు హాట్ టాపిక్ గా  మారిపోతున్న  విషయం తెలిసిందే. వైసీపీ పార్టీ తరఫున విజయం సాధించిన రఘురామ కృష్ణంరాజు ఆ తర్వాత ఏకంగా పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ముందుకు కదిలిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి జగన్ కు వ్యతిరేకంగానే ఉన్నారు రఘురామకృష్ణంరాజు. బిజెపి పార్టీ లోకి వెళ్ళిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత మళ్ళీ వైసీపీ పార్టీలోకి రావడం ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం ఆ తర్వాత విజయం సాధించడం.. కొన్ని రోజుల్లోనే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు లేవనెత్తడం లాంటివి కూడా జరిగిపోయాయి.



 ఇక ప్రస్తుతం రోజురోజుకు ప్రతిపక్షాలు లేవనెత్తని  అంశాలను సైతం తెర మీదికి తెస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రచ్చబండ అనే కార్యక్రమాన్ని పెట్టి రోజు మీడియా సమావేశంలో  జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. జైలుకు వెళ్తాల్సి వస్తుంది అన్న భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పు మీద తప్పు చేస్తూ ఏకంగా న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు రఘురామకృష్ణంరాజు. వైసీపీ నేతలు కూడా రఘురామకృష్ణంరాజుకు  ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉన్న విషయం తెలిసిందే.




 ఇటీవలే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి రేసులో ఉన్న ఎన్.వి.రమణ పై ఫిర్యాదు చేస్తూ జగన్ సర్కారు న్యాయపోరాటం చేస్తున్న తరుణంలో... ఈ విషయంపై స్పందించిన రామకృష్ణగారు కోర్టు ధిక్కరణ కు పాల్పడినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదవి కోల్పోవాల్సి వస్తుందని...అందుకే  తప్పు జరిగిందని  భావించి క్షమాపణలు చెబితే.. ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ సీఎం జగన్ ను హెచ్చరించారు రఘురామకృష్ణంరాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: