మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ దేశాలతో ఎంతగానో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు భారత్ ను  చిన్న చూపు చూడడం మానేసి ఎంతో గర్వంగా చూస్తున్నాయి. అగ్రరాజ్యాల తో సమానంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ ను  చూస్తున్నాయి. ఇందుకు కారణం  భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వివిధ దేశాల విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు కారణమని చెప్పాలి. ముఖ్యంగా భారత్ ఇజ్రాయిల్  మధ్య ఎంతో స్నేహపూర్వక బంధం ఉంది అన్న విషయం తెలిసిందే. దౌత్య పరంగానే కాకుండా వాణిజ్య పరంగా రక్షణ పరంగా  కూడా భారత్ ఇజ్రాయిల్ మధ్య ఎంతో బలమైన బంధం ఉంది.




 ఇలాంటి నేపథ్యంలో ఇటీవల ఇజ్రాయిల్ భారత్ గురించి చేసిన ఒక ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇజ్రాయిల్ విదేశాంగ రాయబారి రోజ్ మాలిక్... ఇటీవలికాలంలో అంతర్జాతీయంగా భారత్ ప్రభావం ఎంతో స్పష్టంగా కనిపిస్తుందని... ఇందుకు గాను  భారత మిత్ర దేశమైన ఇజ్రాయిల్  ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ స్టేట్మెంట్ వెనుక ఎంతో అంతరార్థం ఉంది అని భారత విశ్లేషకులు అంటున్నారు.



 అరబ్ కంట్రీస్ కి ఇజ్రాయిల్ కి  మధ్య ఎన్నో ఏళ్ల నుంచి శత్రుత్వం కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి క్రమంలోనే అరబ్ కంట్రీస్ కి ఇజ్రాయెల్ కి మధ్య శత్రుత్వం రూపుమాపి స్నేహ బంధాన్ని పెంచడంలో భారత్  ఎంతో కీలక పాత్ర పోషించింది. సౌదీ అరేబియా భారత్ పై  అపారమైన ప్రేమ చూపెడుతూ ఏకంగా సోదర దేశం గా భావిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా తో చర్చలు జరిపి ఇజ్రాయెల్ తో ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టి స్నేహ బంధాన్ని పెంచడంలో  భారత్ ఎంతో కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: