భారత్-చైనా సరిహద్దుల్లో  తలెత్తిన వివాదం రోజురోజుకూ మరింత తీవ్రం గా మారిపోతుందన్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ ఎక్కడ తగ్గుముఖం పట్టిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మొదట్లో శాంతియుతంగా చర్చల ద్వారా సరిహద్దుల్లో తలెత్తిన వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసి చైనా తో  చర్చలు జరిపింది. ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ చైనా తీరు మారక పోవడంతో ఇక యుద్ధమే తర్వాతి అన్నట్లుగా భారత్ కూడా సిద్ధమై పోయిన విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఎలాగైతే ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో సైనికులను ఆయుధాలను మొహరిస్తుందో  అంతకుమించి అనే విధంగా భారత్ కూడా ఆయుధాలను సైనికులను సరిహద్దుల్లో మోహరిస్తూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనా కు ధీటుగా బదులిస్తూ యుద్ధం చేసేందుకు సిద్ధమైంది. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత సైన్యం బలం తో పోల్చి చూస్తే... చైనా సైన్యానికి అంత సీన్ లేదు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం గడ్డ కట్టించే శైలిలో లడక్ ప్రాంతంలో పర్వతాలపై భారత సైనికులు వేల సంఖ్యలో పహారా కాస్తున్నారు. ప్రత్యేకమైన గుడారాలు ఏర్పాటు చేసుకోకుండా చిన్న టెంట్లు ఏర్పాటు చేసుకుని అందులోనే ఉంటూ సరిహద్దుల్లో భారత రక్షణకు నిలబడ్డారు.



 అయితే అటు చైనా సైనికులు కూడా భారత సైనికులకు ఎదురుగా నిలబడి పర్వత ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. వారికి ఎంతో దృఢమైన  పటిష్టమైన గుడారాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా చైనా సైనికులు పర్వత ప్రాంతాల్లో ఉన్న మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత కి తట్టుకోలేకపోతున్నట్లు  తెలుస్తోంది. భారత సైనికులు గడ్డకట్టించే చలిలో కూడా యుద్ధం చేయడానికి సిద్ధం అన్న విధంగా ఉంటే...  చైనా సైనికులు పర్వత ప్రాంతాల్లో గడ్డకట్టించే చలిలో  కేవలం పహారా కాయడానికి అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే యుద్ధం గనక తలెత్తితే భారత సైనికులు ఎంతో సులభంగా చైనా సైనికులను తరిమి కొట్టే అవకాశం ఉన్నట్లు భారత రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: