భారత్ చైనా సరిహద్దు లో నెలకొన్న పరిస్థితి రోజురోజుకు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోతున్న విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంకండి అంటూ చైనా సైన్యానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా ఎదుర్కొని యుద్ధం చేసేందుకు భారత్ సిద్ధమైపోతుంది. అయితే ఇప్పటికే భారత సైనికులు చైనా సైన్యానికి దీటుగా నిలబడుతూ గట్టిగా సమాధానం చెబుతున్న విషయం తెలిసిందే. ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు భారత సైన్యం. గడ్డ కట్టించే చలిలో  సైతం ఏకంగా భారత రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరి... పహారా కాస్తున్న విషయం తెలిసిందే.




 ఇలాంటి క్రమంలోనే పాంగ్వాన్  సరస్సు దగ్గర ఇటీవలే ఏకంగా 60 మంది చైనా సైనికులు చనిపోయినట్లు... సంచలన విషయాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పాంగ్వాన్  సరస్సు దగ్గర అసలు ఏం జరుగుతుంది చైనా సైనికులు వరుసగా ఎందుకు మరణిస్తున్నారు అనే విషయం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై ఇటీవలే నిపుణులు రక్షణ రంగ నిపుణులు ఏమంటున్నారంటే.. ప్రస్తుతం భారత సైనికులు లడక్ ప్రాంతంలో పర్వతాలపై గడ్డకట్టుకుపోయే చలిలో సైతం పహారా కాస్తున్నారు అయితే అదే సమయంలో అక్కడ చైనా సైన్యం పహారా కాస్తుంది.



 అయితే చైనా సైన్యానికి చలి  నుంచి మంచు నుంచి తప్పించుకునేందుకు ఎంతో పటిష్టంగా గుడారాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ భారత సైనికులు మాత్రం కేవలం టెంట్ లు  వేసుకొని మాత్రమే ఉంటున్నారు. ఇక  సరిహద్దుల్లో పర్వత ప్రాంతంలో సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులు  చలి కి చైనా సైనికులు తట్టుకోవడం లేదని.. పగటి ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా తేడా ఉండడంతో వారి చర్మం మొత్తం పూర్తిగా ఊడిపోతూ తీవ్ర అనారోగ్యానికి గురవుతుం డంతో రోజురోజుకు చైనా సైన్యం లో భయం పట్టుకుంది అన్న విషయాన్ని ప్రస్తుతం రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ఈ క్రమంలోనే ఎంతో మంది చైనా  సైనికులు ప్రాణాలు కూడా కోల్పోతున్నట్లు  రక్షణ రంగ నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: