భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా యుద్ధం జరిగే అవకాశం ఉన్న క్రమంలో భారత ఆర్మీని  మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత రక్షణ పరిశోధన సంస్థ ఇన్ని రోజులనుంచి అభివృద్ధి చేసిన ఎన్నో ఆయుధాలను ప్రస్తుతం పరీక్షలు నిర్వహించి విజయవంతం అయిన ఆయుధాలను భారత అమ్ములపొదిలో చేరుస్తూ భారత ఆర్మీ మరింత పటిష్టవంతం చేస్తుంది. దీంతో ప్రస్తుతం భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ చేస్తున్న పరిశోధనలు ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే.




 ఏ క్షణంలోనైనా చైనా భారత్ పై యుద్ధం చేసే అవకాశం ఉంది అని భావిస్తున్న భారత ప్రభుత్వం... డీఆర్డివో  తయారు చేస్తున్నటువంటి క్షిపణులు మిస్సైల్ ని పరీక్షిస్తుంది... ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన మిసైల్ ను పరిశీలించి ప్రస్తుతం భారత అమ్ములపొదిలో చేర్చిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే భారత్ ఆర్మీ రోజురోజుకు పటిష్టంగా మారిపోయి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనాని దీటుగా ఎదుర్కొని యుద్ధం చేసేందుకు క్రమక్రమంగా సిద్ధమైపోతుంది. ఇటీవలే మరో అద్భుతమైన ఆయుధాన్ని కూడా డి ఆర్ డి ఓ పరీక్షించి విజయవంతమైంది.




 న్యూక్లియర్ వార్ హెడ్ ను కూడా మూసుకుపోయే సామర్థ్యం కలిగిన అత్యంత శక్తివంతమైన ఆధునికమైన క్షిపణి పృథ్వి 2 డి ఆర్ డి ఓ తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పగలు ఈ క్షిపణి  ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని గుర్తించిన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు రాత్రి సమయంలో ఈ క్షిపణి పనిచేస్తుందా లేదా అనే విషయాలను ఇటీవలే పరీక్షించి విజయవంతమయ్యారు. పృథ్వి 2 రాత్రి సమయంలో కూడా ఎంతో సమర్థవంతంగా టార్గెట్లను ఛేదించి  ధ్వంసం చేయగలదు అనే విషయాలను పరిశోధకులు గుర్తించారు. ఇక పృథ్వీ-2 పూర్తిస్థాయిలో సక్సెస్ అయింది కాబట్టి భారత అమ్ములపొదిలో కి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: