దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతుంది. ప్రస్తుతం కరోనా ప్రభావం కొంతవరకు తగ్గిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పూర్తిగా తగ్గిందని తెలుస్తుంది. తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. మరణాల రేటు కూడా తగ్గడంతో పాటుగా, రికవరీ రేటు కూడా బాగా పెరిగిందని తెలుస్తుంది.అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గింది. మరణాల రేటు కూడా ఆంధ్రలో సగానికి, సగం తగ్గింది.. రికవరీ అవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 



అసలు విషయానికొస్తే..గడిచిన 24 గంటల్లో 70,881 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,676 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,79,146కు చేరుకున్నాయి. గత రెండు నెలలుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు మరణాల రేటు 24 కు చేరింది.6,406కు మొత్తం మరణాల సంఖ్య చేరింది.ఇక జిల్లాల వారీగా కరోనా మరణాల సంఖ్య ను చూస్తే..చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణాలో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, ఇక పశ్చిమ గోదావరి లో ఒకరు మృత్యువాత పడ్డారు.



కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈరోజు కూడా స్వల్పంగా పెరిగిందని అధికారులు వెల్లడించారు..5,529 మంది కరోనా మహమ్మారి నుంచి శనివారం కోలుకున్నారు.7,79,146 పాజిటివ్ కేసులకు గాను, 7,35,638 మంది ఆంధ్రప్రదేశ్ లో కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం వీరంతా గత కొంతకాలంగా కరోనా తో పోరాడి జయించారు. రాష్ట్రం మొత్తానికి 37,102  మంది హోమ్ ఐసొలేషన్ లోనూ, వివిధ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కరోనా కేసులు అలాగే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు..




మరింత సమాచారం తెలుసుకోండి: