ఇటీవలే దుర్గం చెరువు పర్యాటక శోభను సంతరించుకున్న విషయం తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం తో సందర్శకుల తాకిడి కూడా భారీగా పెరిగిపోయింది. అంతేకాకుండా దుర్గం చెరువు లో బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఎంతో మంది సందర్శకులు పర్యాటకులు దుర్గం చెరువును  సందర్శిస్తూ మురిసిపోతున్నారు. అయితే కేవలం దుర్గం చెరువు పై కేబుల్ బుజ్జి ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో  పర్యాటక శాఖ సంతరించుకోవడమే  కాదు ఇంకా ఎంతో మందికి ట్రాఫిక్ కష్టాలు కూడా తీరిన  విషయం తెలిసిందే. ప్రస్తుతం దుర్గం చెరువు ప్రారంభం కారణంగా ట్రాఫిక్ కష్టాలు తీరి ఎంతో సులువైన ప్రయాణం దరి చేరింది ప్రయాణికులకు.



 అయితే ఇటీవలే హైదరాబాద్ నగరంలో కుండపోతగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయారు. నగరంలోని రహదారులన్నీ పెద్ద పెద్ద చెరువులను తలపిస్తు పూర్తిగా జలమయం కావడంతో హైదరాబాద్ నగరం కూడలి లో కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ఎక్కడికక్కడ అధికారులు కూడా ముమ్మర చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ నగరంలో నెలకొన్న ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దుర్గం చెరువు వంతెనపై వాహనాల రాకపోకలను ఇటీవలే సైబరాబాద్ అధికారులు నిలిపివేశారు.





 దీంతో మళ్లీ ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా ప్రయాణికులకు శుభవార్త చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ నెల  17, 18 తేదీలలో దుర్గం చెరువు పై ఉన్న కేబుల్ బ్రిడ్జి పైనుంచి వాహనాలను అనుమతిస్తున్నట్లు  ప్రకటన విడుదల చేశారు. జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ మధ్య రాకపోకలు సాగించే వారు ఈ వంతెన ఉపయోగించుకోవచ్చని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సాధారణంగా అయితే శని ఆది వారాలలో వాహనాల రాకపోకలను నిలిపి వేసి కేవలం సందర్శకులను మాత్రమే అనుమతించేవారు పోలీసులు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సందర్శకులను వంతెన పైకి రాకూడదు అంటూ నిషేధాజ్ఞలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: