హైదరాబాద్ నగరం మొత్తం వరదల్లో తడిసి ముద్దయిన విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికి రహదారిలు  మొత్తం జలమయమై లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధం లోకి వెళ్ళిపోయి చిగురుటాకులా వణిపోయే  భాగ్యనగరంలో...  భారీ వర్షం నమోదు కావడంతో పూర్తిగా జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. ఎటు చూసినా పెద్ద పెద్ద చెరువులను తలపించాయి రహదారులు. ఇక లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పూర్తిగా ఇళ్లల్లోకి నీరు చేరుకోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు. పూర్తిగా రహదారులన్నీ ధ్వంసం అయిపోయాయి. నగరం మొత్తం విద్యుత్ విఘాతం ఏర్పడింది.




 భారీ వర్షం నుంచి నగరం ఇంకా తేరుకోలేక పోతుంది అనే విషయం తెలిసిందే. నాళాలు  ఎక్కడికక్కడ పొంగి మురికి నీరు మొత్తం బయటకు రావడంతో నగరవాసులు పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోయింది. ఎటు చూసినా పూర్తిగా నీరు నిండిపోవడం ఇలా జనావాసాల్లోకి మురికి నీరు రావడంతో ఆ దుర్వాసనతో కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా అల్లాడిపోయారు. ఈ క్రమంలోనే భారీ వరదనీటితో ఏకంగా పెద్ద పెద్ద చెరువులను తలపించాయి హైదరాబాద్ నగర రోడ్లు. అంతేకాదు వరదల్లో చిక్కుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే.



 అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసి అధికారులు పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురుస్తూ వరదలు వస్తున్న నేపథ్యంలో చిన్న పిల్లల తల్లిదండ్రులు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. నగరంలో భారీగా వరద ఉన్న నేపథ్యంలో చిన్న పిల్లలను నిర్లక్ష్యంగా బయటికి వదల వద్దని... వరదల కారణంగా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. అంతేకాకుండా భారీ వర్షాల నేపథ్యంలో అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు జిహెచ్ఎంసి అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: